మహానటి సినిమాకు ముందు ఆమె చేసిన సినిమాలు ఎంత హిట్ ను అందుకున్నా కూడా ఈ సినిమాకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు మరే సినిమాకు రాలేదని చెప్పాలి.ఆమె స్టోరీస్ సెలెక్షన్ ఇతర హీరోయిన్స్ కు భిన్నంగా ఉంటుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరు హీరోల సరసన నటించడానికి ఆమె ఎప్పుడూ రెడీనే.హీరోయిన్ గా ఎంట్రీ కూడా మాలీవుడ్ లోనే జరిగింది. అయితే ఆమెకు హీరోయిన్ గా మంచి గుర్తింపున్చింది మాత్రం టాలీవుడ్ లోనే. ఫస్ట్ మూవీ 'నేనూ శైలజ'తో సూపర్ హిట్టందుకున్న ఆమె ఆ తర్వాత తమిళనాట కూడా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. రెండు భాషల్లోనూ టాప్ హీరోల సరసన నటించింది.


సాధారణంగా టాప్ రేంజ్ కు చేరుకున్న హీరోయిన్స్ ఆ రేంజ్ హీరోలతోనే నటించాలని ఫిక్సవుతారు. అయితే అలాంటి హీరోయిన్స్ అందరికీ భిన్నం కీర్తి సురేశ్. మిడిల్ రేంజ్ హీరోల పక్కన హీరోయిన్ గానూ నటించి మెప్పించింది. ఎన్నో సినిమాల అనుభవంతో చేయాల్సిన మహానటి సావిత్రి పాత్రను చాలా చిన్నవయసులోనే నటించి దాంతో నేషనల్ అవార్డ్ ను కూడా అందుకుంది. ఇక హీరోయిన్ గా ఉన్నవాళ్లు చెల్లెలి పత్రాలు అస్సలు చేయరు. కానీ కీర్తి సురేష్ అవేమి ఆలోచించకుండా నటిగా నిరూపించుకోవడానికి హీరోయిన్ పాత్రలని కూడా ఒప్పుకుంటుంది. స్టార్ హీరోలకు చెల్లెలిగానూ నటిస్తోంది. ఆల్రెడీ రజనీకాంత్ చెల్లెలుగా పెద్దన్నలో నటించిన కీర్తి ఇప్పుడు చిరంజీవి చెల్లెలుగా భోళాశంకర్ లోనూ నటిస్తోంది.


ఇప్పుడు అమ్మడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజిగా అవుతుంది.అయితే వీటితో పాటు కీర్తి సురేశ్ మరో రకంగానూ తాను చాలా ప్రత్యేకం అని నిరూపించుకోవాలనుకుంటుంది. ఆమె త్వరలో నిర్మాణ రంగంలోకి దిగుతోంది. సాధారణంగా హీరోయిన్స్ ఎక్కువగా సినిమాల్లో నటించడాన్ని మాత్రమే కోరుకుంటారు. ఇలా నిర్మాతగా రిస్క్ చేయరు. కానీ తను మాత్రం చాలా డేరింగ్ స్టెప్ వేస్తోందని చెప్పాలి. బలమైన కథలతో చిన్న సినిమాలు తీసే ఆలోచన చేస్తోంది. ఎలాగూ ఆమె తండ్రి జి.సురేశ్ కుమార్ మాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్. బహుశా ఆయనున్నారనే ధైర్యంతోనే ఆమె నిర్మాణ రంగంలోకి దిగిందని అనుకోవాలి..మరి నిర్మాతగా సక్సెస్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: