కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ ప్రస్తుతం వారిసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన , తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా  , సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు టైటిల్ తో విడుదల చేరున్నారు. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి రంజితమే అనే సాంగ్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం సెకండ్ సింగిల్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సాంగ్ ను తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి శింబు పాడాడు. ఈ సాంగ్ విడుదల అయిన 7 గంటల సమయం లోనే 4.4 మిలియన్ వ్యూస్ ను , 804 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ లోని సెకండ్ సాంగ్ కు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: