సెలబ్రిటీస్ ని మించిపోయే స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో నంబర్ వన్ పొజిషన్లో ఉన్న దీప్తి సునయన గురించి మనందరికీ తెలిసిందే .మరి ముఖ్యంగా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయినా అవలీలగా పలికించగలిగే దీప్తి సునైనా అంటే కుర్రకారులకు చాలా ఇష్టం. మోడల్ డ్రెస్లతో మైండ్ బ్లాక్ చేస్తూ పలు వెబ్ సిరీస్ మరియు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది దీప్తి సునైనా. అయితే గతంలో షణ్ముఖ అనే యూట్యూబర్తో నడిపిన ప్రేమాయణం ఇప్పటికీ సోషల్ మీడియాలో టాపిక్. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అతనితో బ్రేకప్ చేసుకున్న దీప్తి సునైనా ప్రస్తుతం అతనికి దూరంగా ఉంది .

తనదైన స్టైల్ లో ఫోటోషూట్ లు చేస్తూ ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది ఈమె. అయితే తాజాగా దీప్తి సునయనకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ గా మారింది .ఇక అదేంటంటే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దీప్తి సునయనకి అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .అంతేకాదు ఒక యంగ్ హీరో కి సిస్టర్ పాత్రలో చేసే అవకాశం ఈమెకి వచ్చినట్లుగా తెలుస్తోంది. 

అయితే దీనికి దీప్తి సునైనా...నేను చేస్తే హీరోయిన్ గానే చేస్తాను లేకపోతే అసలు చేయను కానీ ఇలా చెల్లెలి రోల్స్ సైడ్ రోల్స్  చేయను అని డైరెక్టర్ కి చెప్పేసిందట ..డైరెక్టర్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట దీప్తి సునయన. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అసలే అవకాశాలు రాక చాలామంది ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటుంది ఎందుకో దీప్తి సునయన అంటూ కొందరు కామెంట్లు సైతం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం దీప్తి సునైనా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: