టాలీవుడ్ స్టార్ హీరో పవన్‌ కల్యాణ్ సినిమాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాక చాలా స్పీడ్ గా సినిమాలను లైన్లో పెట్టేస్తూ..చాలా వేగంగా దూసుకుపోతున్నారు. వీటిల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఏంటంటే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు”. 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సినీ అభిమానుల్లో చాలా మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. అభిమానులని ఈ సినిమా విడుదల కోసం ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన “హరిహర వీరమల్లు” ఫస్ట్ లుక్ అయితే యూట్యూబ్‌ను షేక్ చేసి మిలియన్ల కొద్దీ వ్యూస్‌ ను రాబట్టడం జరిగింది. ఇక తాజాగా రిలీజైన వీడియో గింప్ల్ కూడా యూ ట్యూబ్ లో సూపర్ రెస్పాన్స్‌ను రాబడుతోంది.పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన ఈ వీడియో గింప్ల్స్‌… పవన్‌ కళ్యాణ్ సినిమాలో ఏ రేంజ్లో చెలరేగిపోతారో అన్నది అందరికీ కూడా చూపించేసింది.


ఇక అలా చూపించడమే కాదు.. మల్లయోదుడుకు పట్టి కరిపిస్తూ.. పవన్ తొడ కొట్టిన విధానం అయితే అభిమానుల అందరికీ కూడా కిక్కిస్తోంది. దెబ్బకి సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేస్తోంది. తాజాగా ఈ మూవీ సెట్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సెట్లో పవన్ కళ్యాణ్ ఓ లేడీ ఫ్యాన్ తో దిగిన ఫోటో ఇది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తోంది.దీన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఇంట్రవెల్ సందర్భంగా వచ్చే ఫైట్ సీన్ ఇది అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఒక్క ఫైట్ 20 నిముషాలు ఉంటుందని టాక్ అనేది వినిపిస్తోంది. ఇక ఈ లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించనున్నారట. త్వరలోనే ఈ సినిమా నుంచి అదిరిపోయే టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: