‘హిట్ 2’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఈసినిమా కలక్షన్స్ విషయంలో వీకెండ్ తరువాత వచ్చే మొదటి సోమవారం పరీక్షలో కూడ నెగ్గడంతో ఈమూవీ బాక్స్ ఆఫీసు వద్ద హిట్ మూవీగా ఇండస్ట్రీ వర్గాలు తేల్చేసాయి. ఈసినిమాను 23 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేయడంతో విడుదలైన మొదటి మూడు రోజులలోనే ఈమూవీ బ్రేక్ ఈవెన్ కు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.



ఈ పరిస్థితుల నేపధ్యంలో నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ తో కలిసి ఈమూవీని నాని అడవి శేషు తో కలిసి చూడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘హిట్’ సిరీస్ కు సంబంధించి తీసే ప్రతి సినిమాలోను ఒకొక్క హీరో నటిస్తాడని నాని చెపుతున్న విషయం తెలిసిందే. దీనితో హిట్ 4లో బాలయ్య నటిస్తాడా లేదంటే నాని నటించబోతున్న ‘హిట్ 3’ లో బాలయ్య అతిధి పాత్రలో ఏమైనా కనిపిస్తాడా అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.



‘హిట్’ సినిమాని ‘ఎవెంజర్స్’ మూవీ తరహాలో 9 భాగాలుగా తీస్తామని ఇప్పటికే దర్శకుడు శైలేష్ చెపుతున్న విషయం తెలిసిందే. హిట్-2 క్లైమాక్స్ లో నాని అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించి ‘హిట్ 3’ లో తాను నటించబోతున్న విషయాన్ని తెలియచేసాడు. నాని నిర్మాతగా కూడ ‘హిట్’ సాధించడంతో ఈమూవీకి మంచి లాభాలు వస్తాయని అందరు అంచనాలు వేస్తున్నారు.




అయితే ఈమూవీని మీడియం రేట్లకు నాని ఇప్పటికే బయ్యర్లకు అమ్మేయడంతో పాటు ఈమూవీ ఓటీటీ రేట్స్ ను కూడ ముందే ఇచ్చేయడంతో ‘హిట్ 2’ బ్లాక్ బష్టర్ హిట్ అయినప్పటికీ నానీకి పెద్దగా కలిసి వచ్చే లాభాలు లేవు అంటూ మరో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈమూవీకి ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ఈమూవీ పై ముఖ్యంగా అడవి శేషు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈసినిమా విడుదల రోజునే మహేష్ అభినందనలు తెలపడం ఆతరువాత స్వయంగా బాలకృష్ణ తన కొడుకుతో వచ్చి ఈమూవీని చూడటంతో భవిష్యత్ లో నాని బాలకృష్ణ ల మల్టీ స్టారర్ ఉన్నా ఆశ్చర్యం లేదు అన్న సంకేతాలు వస్తున్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: