అవతార్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. అవతార్ వన్ సినిమా విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అవతార్ 2 సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు కళ్లకు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కానీ ఎట్టకేలకు ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించాయి. హాలీవుడ్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన అవతార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ బుకింగ్స్ జరిగాయి.

భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే మరెన్నో అంచనాలు నెలకొనడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.  ఇకపోతే తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నప్పటికీ ఈ సినిమాపై ప్రేక్షకులు పెంచుకుంటున్న అంచనాలు నిర్మాతలకు క్యాష్ రూపంలో వచ్చి పడుతున్నాయని చెప్పవచ్చు.  మొత్తానికైతే హాలీవుడ్ చిత్రం అయినా ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు ఏడు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఐమాక్స్ 3D, ఫోర్ DX , 3D ఫార్మేట్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

అయితే ఈ స్క్రీన్ లపైనే సినిమా చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే ఐమాక్స్ 3D ఫార్మాట్ కలిగిన థియేటర్లో టికెట్ ధర రూ. 1,450 చూపిస్తోంది. పూణేలో రూ.1,200.. ఢిల్లీలో 1000రూపాయలుగా ఉన్న టికెట్ ధరలు.. ముంబైలో రూ.970 , కోల్కతా లో రూ. 770 , అహ్మదాబాద్ లో రూ.750,  ఇండోర్ లో రూ.700 ఉండగా హైదరాబాదులో ప్రస్తుతం ఒక్కో టికెట్ ధర 350 రూపాయలు నిర్ణయించబడ్డారు.  అయితే మునుపేన్నడు లేని విధంగా.. హైదరాబాద్ లో వున్న భారతదేశంలోనే అతిపెద్ద ప్రసాద్ థియేటర్ ఈ సినిమా కోసం ముస్తాబవుతోంది.  ప్రేక్షకులకు అందమైన సినిమా ఎక్స్పీరియన్స్ ను అందివ్వడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాదులో డిసెంబర్ 16న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఐదు షోలను వేయడానికి భారీ సంఖ్యలో స్క్రీన్ లని కూడా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇన్ని అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: