టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక చిత్రం ఈ హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఫ్యాన్స్ కు ఆ హిట్ ఏమాత్రం కూడా సరిపోలేదు. పైగా గాడ్ ఫాదర్ సినిమా రీమేక్ అవ్వడంతో అంతగా ఫ్యాన్స్ కు ఈ సినిమా నచ్చలేదు. ఇక ఇప్పుడు మంచి మాస్ మసాలా మూవీతో రాబోతున్నారు చిరు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు ఇంకా అలాగే టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య సినిమా నుంచి వచ్చిన బాస్ పార్టీ లిరికల్ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ గురించి అయితే అసలు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.


ఇక ఇదిలా తాజాగా ఈ చిత్రం నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. వాల్తేరు వీరయ్య సినిమాని మొదటి నుంచి సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చెప్తూ వస్తున్నారు మేకర్స్. ఇక అనుకున్నట్టుగానే ఈ చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో చిరంజీవి మంచి మాస్ లుక్ లో కనిపించారు.సముద్రం మధ్యలో బోట్ పై వేటకు వెళ్తున్న పోస్టర్ ను చిత్రబృందం వారు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ కు అయితే ఒక రేంజిలో పూనకాలు తెప్పించేలా ఉంది. ఇక ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ మూవీలో మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం అందిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ కు జోడీగా శ్రుతిహాసన్ కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: