రామ్ గోపాల్ వర్మ.. ఆయన ఒక సంచలనం. ఎప్పుడూ వివాదాలతో సావాసం చేయడం ఆర్జీవీకి వెన్నతో పెట్టిన విద్య . ఆయన సినిమాలే కాదు మాటలు చేష్టలు కూడా ఊహించడం కష్టమే.

నిత్యం సోషల్ మీడియా లో కయ్యానికి కాలుదువ్వేలా కామెంట్స్ చేసే వర్మ ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారు. ఇక ఆయన ల విషయానికొస్తే వాస్తవాలను చూపిస్తా అంటూ ఇప్పటికే పలు బయోపిక్ లతో తెగ రచ్చ చేశారు. అలాగే ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది. అలాగే ఆ ఇద్దరు కలిసి వారికీ ఎదురైన సమస్యలనుంచి ఎలా తప్పించుకున్నారు.? అనే కథాంశం తో తెరకెక్కిస్తున్నారు. డేంజరస్ అనే టైటిల్ తో రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ.

తాజాగా ఆర్జీవీ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏం చేసిన వెరైటీగా చేయడం ఆర్జీవీ స్టైల్. తాజాగా డేంజరస్ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిందట.. ఈ ఇన్టర్వ్యూ లో ఆర్జీవీ అషు కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఉన్నట్టుండి.

అషు రెడ్డి కాలిని పట్టుకొని ఆమె పదాన్ని ముద్దు పెట్టుకున్నారు. ఆర్జీవీ అలా చేసేసరికి అషు రెడ్డి షాక్ అయ్యిందని తెలుస్తుంది.ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె కాలికి ఉన్న చెప్పును తీసి ఆమె పాదాలను ముదుపెట్టుకున్నారు ఆర్జీవీ. దాంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అషు రెడ్డి కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆర్జీవి చేసిన పనికి నెటిజన్లు అయితే రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పటి డైరెక్టర్ లకు  మంచి ఇన్స్పిరేషన్ గా ఉండేవారు. కానీ ఆయన  వ్యవహార శైలి మాత్రం అందరికంటే ఎంతో భిన్నంగా ఉంటుంది.దాని మూలంగానే ఆయనను పట్టించు కోవడం మానేశారు. ఇండస్ట్రీ వర్గాలు 

మరింత సమాచారం తెలుసుకోండి: