సినిమా ఇండస్ట్రీ లో చాలామంది నటీనటుల మధ్య ఎఫైర్లు  ఉండడం అనేది చాలా కామన్. ఇక మరికొంతమంది సెలబ్రిటీల విషయంలో ఏమీ లేకున్నా కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి మరీ ఎన్నో వార్తలు రాస్తూ ఉంటారు. వీళ్ళు కనీసం పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నా సరే వీరి మధ్య ఏదో జరుగుతుంది అంటూ పుంకానపుకాలుగా వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక ఇలాంటి వార్తలే అప్పట్లో స్టార్ హీరోయిన్ అనుష్క (ANUSHKA) హీరో గోపీచంద్ మధ్య కూడా వచ్చాయి. ఇంతకీ వారి మధ్య వార్తలు రావడానికి ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో గోపీచంద్ (Gopichand) అనుష్క (Anushka) ఆన్ స్క్రీన్ జోడి ఆయితే చాలా బాగుండేది. వీరిద్దరి కాంబినేషన్లో శౌర్యం,లక్ష్యం (LAKSHYAM) సినిమాలు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమాలు చేసే టైంలో వీరిమధ్య లవ్ నడిచింది అనే టాక్ గట్టిగానే వినిపించింది. అంతేకాకుండా అనుష్క ఓ సినిమాలో భాగంగా ఎక్స్పోజింగ్ చేయడానికి రెడీ అయితే గోపీచంద్ ఫోన్ చేసి మరి నువ్వు అలాంటి పాత్రల్లో నటించద్దు అని వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది.. కానీ అనుష్క మాత్రం ఆయనని పట్టించుకోకుండా ఆ సినిమాలో ఎక్స్పోజింగ్ చేసిందట. ఇక ఈ వార్త అప్పట్లో వైరల్ అవ్వడంతో వీరి మధ్య నిజంగానే లవ్ ఉంది అంటూ అందరిలో కూడా అనుమానాలు తలెత్తాయి.

ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఏకంగా గోపీచంద్ ఇంట్లో కూడా తెలిసిపోయి ఇంట్లో చాలా గొడవలు కూడా జరిగాయట. ఇక ఈ విషయంపై ఎన్నో వార్తలు రావడంతో అనుష్క గోపీచంద్ లు స్పందించి మా మధ్య అలాంటివి ఏమీ లేవు అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. వీరు అంత స్పష్టంగా క్లారిటీ ఇచ్చినప్పటికీ వీరి మధ్య వచ్చే వార్తలకు మాత్రం పుల్ స్టాప్ పడలేదు. అలాగే వీరి మధ్య వార్తలు వస్తున్నప్పటికీ ఆర్ఆర్ మూవీ మేకర్ సంస్థ వీరి కాంబినేషన్లో ఓ సినిమా తీద్దామని నిర్ణయించుకున్నారట.. ఈ సినిమాకి గోపీచంద్ కూడా ఒప్పుకున్నారట.కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఈ సినిమాలో నటించవద్దని గొడవకు అయితే దిగారట.

అలాగే అనుష్క మాత్రమే కాకుండా ఏ ఒక్క హీరోయిన్ కూడా మన ఇంటికి రాకూడదు అంటూ ఇంట్లో వాళ్ళు గోపీచంద్ (GOPICHAND)కి వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇక ఈ విషయంలో విసిగిపోయిన గోపీచంద్ సినిమా ఇండస్ట్రీ అన్నాక ఇటువంటి వార్తలు రావడం కామన్.మీరు వాటిని పట్టించుకోని గొడవలు చేయొద్దు అంటూ చాలా గట్టిగా చెప్పడంతో అప్పటినుండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సైలెంట్ అయ్యారని తెలుస్తుంది.ఇలా అనుష్క గోపీచంద్ మధ్య ఉన్న కాస్త కూస్తో స్నేహం వల్ల ఏకంగా గోపీచంద్ ఇంట్లో వాళ్ళు గొడవలు పెట్టుకున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: