టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈమె అంటూ తెలుగు లో మాత్రమే కాకుండా ఇటు తమిళ్ మరియు హిందీ భాషల్లో కూడా తనదైన శైలిలో మంచి సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. ఈమెతోపాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్ వంటి హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకొని సెటిల్ అయినా కూడా తమన్నా మాత్రం ఇంకా సింగల్ గానే ఉంది. అయితే ఈమె ఒక బిజినెస్ మాన్ తో ఇప్పుడు ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అనే వార్తలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. 

కానీ దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటికి రాలేదు. అయితే తాజాగా తమన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలపై స్పందించింది. అయితే తమన్న మాట్లాడుతూ నా అభిమానులు నాపై చూపించే ప్రేమ నన్ను ఎప్పుడో చాలా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. అంతేకాదు నా కెరియర్ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం నేను చేసిన పాత్రలను నా అభిమానులకు ఎంతో గర్వంగా చూపించగలను .అంతేకాదు దాంతోపాటు నేను పెళ్లి చేసుకోబోయే వాడిని కూడా అంతే గర్వంగా ప్రకటించాలని అనుకుంటున్నాను.

కానీ అందులో దాచడానికి ఏమీ లేదు అని నాకు ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలు అసలు లేవు అని ఇంట్లో కూడా నామీద పెళ్లి ఒత్తిడి ఏమాత్రం లేదు అని మీడియాలో చాలా రూమర్లు వస్తున్నప్పటికీ అందులో ఎలాంటి నిజాలు లేవు అని అలాంటిది ఏమైనా ఉంటే నేనే నా అభిమానులకు చెప్తాను అని తమన్న చెప్పుకొచ్చింది. దీంతోపాటు ఈ వయసు లోపల పెళ్లి చేసుకోవాలని టార్గెట్లు నాకు అసలే లేవు. ఇక అలాంటి రోజు వస్తే కచ్చితంగా గర్వంగా నేనే ప్రకటిస్తాను అని మిల్కీ బ్యూటీ తమన్న చేసిన ఈ కామెంట్లు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. దీంతో తమన్నా అభిమానులకు ఆమె పెళ్లిపై వస్తున్న రూమర్లపై క్లారిటీ వచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: