ప్రతి ఏడాది ప్రఖ్యాతి వెబ్సైట్ గా పేరు పొందిన టాప్ -10 సెలబ్రిటీ జాబితాను ప్రకటిస్తూనే ఉంటుంది. దేశవ్యాప్తంగా అత్యధిక పాపులారిటీ అందుకున్న జాబితా వెల్లడించడం జరిగింది. 2022 ఏడాదికి సంబంధించి సెలబ్రిటీల జాబితాను IMBD విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో నెంబర్ వన్ పొజిషన్లో ఉండడం గమనార్హం . అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము.


ఈ జాబితా విషయానికి వస్తే.. మొదటి స్థానంలో కోలీవుడ్లో,  టాలీవుడ్లో విభిన్నమైన హీరోగా పేరుపొందిన ధనుష్ మొదటి స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక రెండవ స్థానంలో  బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నిలిచింది. ఇక మూడవ స్థానంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ అవకాశాన్ని దక్కించుకోగా.. నాలుగవ స్థానంలో రామ్ చరణ్ తేజ స్థానాన్ని దక్కించుకున్నారు ఇక ఆరవ స్థానంలో సమంత ..ఏడవ స్థానంలో హృతిక్ రోషన్ ఎనిమిదవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్.. తొమ్మిదవ స్థానంలో అల్లు అర్జున్.. పదవ స్థానంలో కన్నడ స్టార్ హీరో యష్ స్థానాలను దక్కించుకున్నారు.


ఇందులో ప్రభాస్ లేకపోవడంతో అభిమానులు ఫీల్ అవుతున్నారు.  బాహుబలి తో ఫేమస్ అయినా.. అటుపై చేసిన సాహో, రాధే శ్యామ్ రెండూ కూడా వైఫల్యంతో దెబ్బ పడింది. అందుకే మిగతావాళ్లు రేస్ లోకి వచ్చేసారు. ఐశ్వర్యారాయ్ కూడా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. అలాగే కియారా కూడా ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సక్సెస్ పొందిన విషయం తెలిసిందే.  అలాగే ఇప్పుడు శంకర్ , రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఆర్సి 15 సినిమాల్లో కూడా ఛాన్స్ అందుకుని కొంతమంది ప్రజెంట్ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న వారే ఈ పది స్థానాలను కైవసం చేసుకోవడం గమనార్హం. ఏది ఏమైనా తమ అభిమాన నటీనటులు టాప్ టెన్ జాబితాలో ఉండడంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది తమ అభిమాన నటీనటులు లేరని నిరాశ వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: