టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ హీరో సినీ కెరియర్ పరంగా ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో తండ్రి కాలేదు అన్న బాద ఇన్ని రోజులకి తీరింది. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఆ విషయాలను పట్టించుకోకుండా సక్సెస్ ఫుల్ గా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆయన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు .

దీంతో మెగా అభిమానులు అందరూ ఎంతో ఆనందిస్తున్నారు. వీరి పెళ్లి  అయి దాదాపు పది సంవత్సరాలు గడుస్తున్న పిల్లలు లేరు అనే బాధ మెగా ఫ్యామిలీని ఎప్పుడు భావిస్తూ ఉండేది. ఈ గుడ్ న్యూస్ వినగానే చాలామంది అభిమానులు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇదిలావుంటే ఇక ఇప్పుడు  రామ్ చరణ్ తండ్రి కావడం ఓ హీరోయిన్ కి ఇష్టం లేదని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ ఇటీవల నటించిన ఆర్ఆర్ సినిమాతో ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు.

సినిమా ప్రమోషన్ టైం లో రామ్ చరణ్ ని ఒక నటి ఇంటర్వ్యూ చేసింది.ఆమె ఎవరో కాదు నహిబా బలి ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లలో నటించడం జరిగింది. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అని న్యూస్ అఫీషియల్ గా చిరంజీవి బయట పెట్టడంతో ఆ నటి చాలా ఫీల్ అయినట్టు ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. మీరు ఎంతగానో ఇష్టపడే వ్యక్తి లేదా ఎంతగానో అభిమానించే వ్యక్తి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న లేక వారితో డేటింగ్ చేస్తున్న ప్రేమలో ఉన్న పిల్లల్ని కన్నా మీలో చాలా అసూయ కలుగుతుంది అని ఆమె పోస్టులో పేర్కొంది అంతేకాదు వారు హ్యాపీ గానే ఉంటారు..కానీ మనము దాన్ని తట్టుకోలేము అంటూ ఆమె తన సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.దింతో ఆమె చేసిన పోస్ట్ కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: