25 సంవత్సరాల క్రితం నెలకు 5వేల జీతంతో టివి సీరియల్స్ తీసిన రాజమౌళి ఈరోజు దేశం గర్వించే దర్శకుడుగా ఎదగడమే కాకుండా సినిమాకు 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు అని వస్తున్న వార్తలను బట్టి అతడి రేంజ్ ఏమిటో ఎవరికైనా వెంటనే అర్థం అయిపోతుంది. గత రెండు దశాభ్దాలుగా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న రాజమౌళి ఫెయిల్యూర్ అన్న పదాన్ని ఎరగడు.


తాను తీసే ప్రతి సినిమాకు బడ్జెట్ ను పెంచడమే కాకుండా ఆమూవీ కలక్షన్స్ స్థాయిని కూడ పెంచుతున్న ఇతడితో ఒక బాలీవుడ్ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో సక్సస్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు జక్కన్న. విజయానికి రహస్యం అంటూ ఏమీ ఉండదు అని అంటూ సినిమాలు తీసే దర్శకుడుకి ప్రేక్షకులతో ఒక రిలేషన్ ఉండాలని ఆడియన్స్ పల్స్ ఏమిటో తెలుసుకోవాలి అప్పుడే విజయం వస్తుంది అంటూ కామెంట్స్ చేసాడు.


అంతేకాదు ఒక వ్యక్తి నిజంగా కష్టపడాలని కష్టపడ్డాను అని ఊహించుకుంటే సక్సస్ అందుకోలేడు అని చెప్పాడు. అంతేకాదు ఒక పని మొదలుపెట్టినప్పుడు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయని అలాంటి ఎదురు దెబ్బలు తగిలినా తన పై తాను నమ్మకం పెట్టుకున్న వ్యక్తి మాత్రమే విజయం సాధించగలడు అని అభిప్రాయపడుతున్నాడు. అదేవిధంగా ఒక సినిమా మొదలుపెట్టినపుడు అందరికీ రకరకాల సందేహాలు వస్తాయి అని అంటూ అసలు సినిమా విజయం సాధిస్తుందా లేదా అని అనిపించే అవకాశం ఉందని ఎన్ని సందేహాలున్నా ఉత్సాహంగా పని చేయగలిగినప్పుడు మాత్రమే ఏవ్యక్తికి అయినా సక్సస్ వస్తుంది అని అంటున్నాడు.


వందల కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే రాజమౌళి మాత్రం చాల సింపుల్ గా ఉండటమే కాకుండా ఎలాంటి విలాశాలకు తావు ఇవ్వకుండా ప్రతిరోజు ఎదో ఒక పని చేస్తూ గడపడం జక్కన్న అలవాటు. ఇన్ని మంచి లక్షణాలతో పాటు అదృష్టం కూడ జక్కన్న వెంట ఉంది కాబట్టే ఒక తెలుగువాడు ఆస్కార్ రేసులోకి వెళ్ళే అవకాశాల వైపు అడుగులు వేస్తున్నాడు..    



మరింత సమాచారం తెలుసుకోండి: