రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రోమో రానే వచ్చేసింది. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2లో పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా అలాగే అతని ప్రాణ స్నేహితుడు అయిన గోపిచంద్‏తో కలిసి సందడి చేశారు.పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను బాలయ్యతో కలిసి గోపిచంద్ ఓ ఆటాడుకున్నారు. ఇక అంతేకాదు.. చాలా కాలం తర్వాత మన బాహుబలి ప్రభాస్ ఎంతో సరదాగా నవ్వుతూ కనిపించారు. ఇంకా అలాగే ఈ వేదికపై ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్ మరో హీరో గోపిచంద్ తో బాలయ్య అల్లరి అయితే చాలా బాగా అదిరిపోయింది.


అందులో కూడా యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ ను ఓ రేంజ్ లో టీజ్ చేశారు హీరో గోపిచంద్.డార్లింగ్‏కు సంబంధించిన పర్సనల్ విషయాలను బయటపెట్టేందుకు గోపిచంద్ బాగా ప్రయత్నిస్తుండగా.. ఆయన్ని ఆపేందుకు ప్రభాస్ ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.ఇంకా అలాగే.. డార్లింగ్ కు సంబంధించిన ఓ సీక్రెట్ ని కూడా రివీల్ చేసేందుకు గోపిచంద్ ట్రై చేయగా.. ఓరెయ్ అంటూ ఆపే ప్రయత్నం చేశారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఆ తర్వాత ప్రభాస్ గోపిచంద్ మీదకు ఏదో విసరడానికి ప్రయత్నిస్తుండగా.. బాల కృష్ణ గోపిచంద్ కు అడ్డుగా నిలబడ్డారు.ఇక ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఇంకా అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: