అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ చందమామ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తన అంద చందాలతో , నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుని ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. 

ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ కొంత కాలం క్రితమే వివాహం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కూడా సినిమాల్లో నటిస్తోంది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా కేరీర్ ను ముందుకు సాగిస్తున్న కాజల్ అగర్వాల్ ఈమధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.

అందులో భాగంగా కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటో లలో ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కు సంబంధించిన ఈ క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: