నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస కమిట్మెంట్ లతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ" వీర సింహా రెడ్డి" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల కాకముందే బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రారంభం అయింది. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్లో 108 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన ప్రియమణి లేదా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ లో బాలకృష్ణ కూతురుగా శ్రీ లీల కనిపించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా వరుస సినిమా కమిట్మెంట్ లతో ఫుల్ బిజీ గా ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 3 కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం కూడా తెలిసిందే.

ఇలా వరుస కమిట్మెంట్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్న బాలకృష్ణ స్టార్ మా చానల్లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ 7 కు హోస్ట్ వ్యవహరించే అవకాశం ఉంది అంటూ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 , 4 , 5 , 6 మరియు "ఓ టి టి" లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున "బిగ్ బాస్" నుండి తప్పుకోబోతున్నాడు అనే వార్తలు రావడంతో బాలకృష్ణ "బిగ్ బాస్" సీజన్ 7 కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: