బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మేన్ గా నెల్లూరు ఆదిరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. కెప్టెన్‌ నుంచి థర్డ్‌ రన్నరప్‌గా ఎదిగాడు ఆదిరెడ్డి. విన్నర్‌ కాలేకపోయానన్న బాధ కన్నా తనను ఫినాలే వరకు తీసుకొచ్చి ఆదరించినందుకు ఎక్కువ సంతోషపడుతున్నాడు. తనకింత గుర్తింపు తెచ్చిన బిగ్‌బాస్‌ షోకు, ఓట్లేసి ఇంత దూరం తీసుకువచ్చిన ప్రేక్షకుల కు జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. ప్రేక్షకుల అభిమానమే కాకుండా బిగ్‌బాస్‌ ద్వారా అతడు ఎంత సంపాదించాడో చూద్దాం..



గత కొన్ని సీజన్ల నుంచి ఆదిరెడ్డి రివ్యూలు ఇస్తూ పోతున్నాడు. అతడి రివ్యూల ను మెచ్చుకునే వాళ్లు ఉన్నారు, విమర్శించే వాళ్లూ ఉన్నారు. ఏ కంటెస్టెంట్‌ దగ్గరో డబ్బులు నొక్కేసాడు, అందుకే వారిని పొగుడుతూ వేరేవారిని తిడుతున్నాడన్న మాటలు కూడా వినిపించేవి. కానీ అలాంటి విమర్శలను ధీటుగా తిప్పి కొట్టేవాడు ఆదిరెడ్డి. నాకు డబ్బిచ్చేంత సీన్‌ ఏ కంటెస్టెంట్‌ కూ లేదని, బిగ్‌బాస్‌ షోలో ఉన్నవారి కంటే యూట్యూబ్‌ లో తాను ఎక్కువ సంపాదిస్తాన ని చెప్పేవాడు. తనను కొనడం ఎవ్వరితరం కాదని కుండ బద్ధలు కొట్టేవాడు.



ఒక సినిమా కు స్టార్‌ హీరోయిన్‌ అందుకునే పారితోషికం.. తన నెల సంపాదన తో సమానం అని ఆదిరెడ్డే స్వయంగా చెప్పాడ ని తెలిపాడు. అతడు డబ్బుల కోసం కాకుండా బిగ్‌ బాస్‌ జర్నీని ఆస్వాదించాలని వచ్చాడని పేర్కొన్నాడు. షానీ చెప్పినదాని ప్రకారమైతే బిగ్‌బాస్‌ అతడి కి కోట్ల ల్లో ఇవ్వాలి. కానీ అంత ఇచ్చుకోలేమని బిగ్‌ బాస్‌ చేతులెత్తేశాడట.. సోషల్‌ మీడియా లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. వారానికి లక్ష రూపాయ లకు అటూ ఇటుగా పారితోషికం అందుకున్నాడట ఆది. ఈ లెక్కన 15 వారాలకుగానూ అతడు దాదాపు రూ.12 లక్షల వరకు వుంటుందని వినిపిస్తోంది.. ఇతను బాగానే అందుకున్నాడు.. సీనియర్ నటులకు కూడా అంత రాలేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: