తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా క్లియర్ ను కొనసాగిస్తున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఇప్పటికే ఈ సంవత్సరం కార్తికేయ 2 మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించగా , టాలెంటెడ్ డైరెక్టర్ చందు మండేటి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన కార్తికేయ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని నిఖిల్ కు అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర తీసుకువచ్చింది. ఇలా కార్తికేయ 2 లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత నిఖిల్ "18 పేజెస్" మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. కార్తికేయ 2 మూవీ తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది.

18 పేజెస్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం.
నైజాం : 3.50 కోట్లు.
సీడెడ్ : 1.5 కోట్లు.
ఆంధ్ర : 5 కోట్లు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 18 పేజెస్ మూవీ 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో : 50 లక్షలు.
ఓవర్ సీస్ లో : 1.50 కోట్లు.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 12 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ మూవీ కనుక 12.50 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: