జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్న రష్మి గౌతమ్ అందరికీ తెలిసే ఉంటుంది. సుడిగాలి సుదీర్ మరియు యాంకర్ రష్మీప్రేమ పేరుతో ఈ షో  మరింత క్రేజ్ ను అందుకుంటుంది. అయితే గత కొన్ని ఏళ్లు గా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల సుడిగాలి సుధీర్ ఈటీవీ నుండి వెళ్లిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. దాంతో ఈ వార్తలు రావడం కాస్త తగ్గాయి. అయితే వీరిద్దరూ కలిసి చాలా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. దాంతోపాటు ఎప్పుడూ మా ఇద్దరికీ సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. 

మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాము అంటూ కూడా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదు అంటూ స్పష్టం చేశారు వీరిద్దరూ. వీరిద్దరూ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చినప్పటికీ ఏదో ఒక విధంగా ఈ వార్తలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే ఈ క్రమంలోనే ఒక సీనియర్ జర్నలిస్టు రష్మికి సంబంధించి ఒక పోస్టును చేశాడు. ఇక అందులో భాగంగా ఆయన రష్మికి ఆల్రెడీ పెళ్లయిందని... పెళ్లయి కూడా 10 సంవత్సరాలు కావస్తుంది అని కాకపోతే రష్మీకి ఉన్న సేమ్ కారణంగా ఈ విషయాన్ని దాచుతుంది అని ఒకవేళ పెళ్లయింది అని తెలిస్తే ఆమెకు అవకాశాలు తగ్గిపోతాయని ఆయన పేర్కొన్నాడు.

ఆ సీనియర్ జర్నలిస్ట్ మాత్రమే కాకుండా చాలామంది ఈమె పెళ్లి గురించి మాట్లాడుతూ రష్మికి ఆల్రెడీ పెళ్లి అయ్యిందని కానీ ఆ విషయాన్ని బయట చెప్పడం లేదు అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు. రష్మి అనే కాదు  సాధారణంగా సినీ సెలబ్రిటీలు చాలామంది వారికి పెళ్లయినప్పటికీ ఆ విషయాన్ని వారి అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అయితే గతంలో కూడా యాంకర్ రవికి పెళ్లి అయ్యింది అనే వార్తలు సైతం వచ్చిన సంగతి తెలిసిందే .ప్రస్తుతం రవి పరిస్థితి లాగానే యాంకర్ రష్మీ పరిస్థితి కూడా ఉంది అంటూ అంటున్నారు .దీంతో ఈ వార్త విన్న రష్మీ అభిమానులు ఇదంతా అబద్ధమని త్వరలోనే రశ్మి పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెబుతుంది అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: