ఈ ఏడాది కన్నడలో అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన కాంతార సినిమా విడుదలై ఈ ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నప్పటికీ ఫ్లాప్ లో అందుకుంటున్న ఈ సమయంలో అతి తక్కువ బడ్జెట్ తో తెరక్కెక్కి వందల కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఈ సినిమాకి పాతిక కోట్లు కూడా సరిగ్గా ఖర్చు పెట్టకుండా తీసినప్పటికీ విడుదలైన అనంతరం ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఇక విడుదలైన అనంతరం ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా మెప్పిచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

సినిమా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదలై అక్కడ కూడా మంచి హిట్ టాక్ను అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి మంచి క్రేజ్ ను సైతం సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే కన్నడ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కాంతార సినిమాకి సంబంధించిన సీక్వెల్ గురించి ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా ఎండింగ్ లో చుస్తే   ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ కచ్చితంగా ఉంది అని చాలామంది భావిస్తున్నారు.

దీనికిగాను తాజాగా ఈ సినిమా మేకర్స్ నుండి కాంతార సినిమా సీక్వెల్ కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇక అదేంటంటే ఈ సినిమా మేకర్స్ కాంతార సినిమా యొక్క సీక్వల్ కచ్చితంగా ఉంది అని కన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక కాంతార సినిమా విడుదలైన అనంతరం అనేక రకమైన అవార్డులను సైతం అందుకుంది. అయితే ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ కోసం వెయిట్ చేస్తున్నామని అది అయిపోయిన వెంటనే ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ ను పెడతామని మేకర్స్ తెలిపినట్లుగా సమాచారం. ప్రస్తుతం రిషబ్  మాత్రం హాలిడేలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులను మేకర్స్ మొదలుపెట్టబోతున్నారు అని వార్తలు సైతం వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: