పాన్ ఇండియా  స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. 'ఆదిపురుష్ ', 'సలార్', 'ప్రాజెక్ట్ కె' వంటి బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మరోసారి ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డులపై కన్నేసాడు. ఇందులో ముఖ్యంగా సలార్ సినిమా మీద ఇప్పటికే ఆకాశన్నంటే అంచనాలున్నాయి.అయితే ఈ సలార్ సినిమా ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ వచ్చినా, ఈ సినిమా ఇంకా వాయిదా పడుతూనే ఉన్నా కూడా రెబల్ స్టార్ అభిమానులు మాత్రం ఇంకా ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు పెంచేసుకుంటున్నారు.అయితే ఇంత వరకు సలార్ నుంచి కేవలం పోస్టర్లే తప్ప సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్లు రాలేదు. ఈ సినిమా పోస్టర్లను మాత్రం అప్పుడప్పుడు స్పెషల్ అకేషన్‌లకు రిలీజ్ చేస్తూ వచ్చారు.అయితే ఈ సలార్ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నెలలో రిలీజ్ కానుంది. ఈ సినిమాని నిర్మిస్తోన్న హోంబళే సంస్థ అధినేత నిర్మాత విజయ్ తన బర్త్ డే సందర్భంగా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సలార్, కేజీయఫ్‌ సినిమాల మీద అతను స్పందించాడు.


ఈ సినిమాలకు ఫ్రాంచైజీలను చేస్తూనే వెళ్దామని అనుకున్నట్టుగా అతను చెప్పుకొచ్చాడు.ఒకసారి సలార్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఆలోచిస్తామని అతను చెప్పుకొచ్చాడు.అయితే ఇప్పటి దాకా ఈ సినిమా షూటింగ్ ఎనభై శాతం షూటింగ్ పూర్తయిందని, ఇంకా మిగిలిన షూటింగ్ జనవరి నెలలో కంప్లీట్ చేస్తామని నిర్మాత తెలిపాడు. ఓ ఆరునెలలు పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా వీఎఫ్‌ఎక్స్ పనులకే కేటాయిస్తామని ఆ నిర్మాత అన్నాడు. ఇంకా ఇది పక్కా యాక్షన్ సినిమానే అని చెప్పుకొచ్చాడు. అయితే సలార్ సినిమా బాక్సాఫీస్ రికార్డుల మీద నిర్మాత ఇంత కాన్ఫిడెంట్ గా స్పందించాడు.ఇక సలార్ సినిమా కనుక రిలీజ్ అయితే మేం తీసిన సినిమాల రికార్డులన్నింటిని బద్దలు కొట్టేస్తుందని అతను చెప్పుకొచ్చాడు. ఇప్పటి దాకా కొన్ని రషెస్ చూశానని, చాలా అదిరిపోయాయని చెప్పుకొచ్చాడు. అలాగే సలార్ పార్ట్ 2, పార్ట్ 3లు కూడా ఉండే అవకాశం ఉంది. చూడాలి సలార్ ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: