ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలతో ఈక్వల్ గా ఒక రేంజ్ ఫాం కొనసాగిస్తున్న యువ హీరోల్లో నిఖిల్ ఒకరని చెప్పొచ్చు. అంతకుముందు అతని సినిమాలు ఎలా ఉన్నా సరే స్వామిరారా నుంచి అతని కథల పంథా మార్చేశాడు. ప్రతి సినిమాలో సంథింగ్ స్పెషల్ కంటెంట్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇక కార్తికేయ సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 అయితే నేషనల్ వైడ్ గా మనోడి పేరు మారు మ్రోగించేలా చేసింది. నిఖిల్ తన కెరీర్ లో ఇలాంటి సక్సెస్ జోష్ అనుభవించలేదు.

కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నటించిన 18 పేజెస్ మూవీ శుక్రవారం రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో కొద్దిగా లేట్ అయిన విషయం వాస్తవమే అయినా సినిమా కథ సుకుమార్ ఇవ్వడంతో ఆ లేట్ అన్నది కనిపించలేదు. ఈ క్రమంలో నిఖిల్ 18 పేజెస్ మూవీతో మరో హిట్ బొమ్మ తన ఖాతాలో వేసుకున్నాడు. నిఖిల్, అనుపమల జోడీ కార్తికేయ 2తో సెన్సేషనల్ హిట్ అందుకోగా ఇక ఇప్పుడు 18 పేజెస్ తో కూడా మరో సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా విషయంలో నిఖిల్ నమ్మకం మరోసారి నిలబడింది.

నిఖిల్ కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద హిట్ కొట్టగా 18 పేజెస్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పోటీగా వచ్చిన రవితేహ ధమాకా ఆశించిన స్థాయిఓ టాక్ తెచ్చుకోలేదు. రొటీన్ కథతోనే మరోసారి మాస్ రాజా నిరాశపరచాడని టాక్. ఇది కూడా నిఖిల్ 18 పేజెస్ కి కలిసి వచ్చే అంశమే. అలా నిఖిల్ కి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు వచ్చాయి. నిఖిల్ ఇప్పుడున్న ఫాం చూస్తుంటే తన నెక్స్ట్ సినిమా మరింత మార్కెట్ రేంజ్ పెంచుకుంటాడని అనిపిస్తుంది. కార్తికేయ 3 ఎలాగు ప్లాన్ లో ఉండగా ఈ టైం లో ఒక స్టార్ డైరెక్టర్ తో కరెక్ట్ సినిమా పడితే నిఖిల్ కూడా స్టార్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: