టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన నటించిన మొదటి సినిమాతో ఆయనకి అంత గుర్తింపు దక్కలేదు. దాని అనంతరం ఆయన నటించిన గీతాంజలి మరియు శివ సినిమాలతో ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగాడు. అప్పటినుండి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారాడు నాగార్జున. ఇటీవల ఆయన నటించిన ఘోస్ట్ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో తన నెక్స్ట్ సినిమాని ఎలాగైనా హిట్ చేయాలి అని ఆలోచనలో ఉన్నాడు నాగార్జున. 

ఇక ఆ సినిమాకి సంబంధించిన చర్చలను కూడా నాగార్జున ఇటీవల మొదలుపెట్టినట్లుగా సమాచారం. నాగార్జున వారసులుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య మరియు అఖిల్ కూడా వరుస సినిమాలు చేశారు. అయినప్పటికీ వీరికి స్టార్ హీరోగా మాత్రం మంచి గుర్తింపు లభించలేదు. అయితే తాజాగా ఇప్పుడు నాగార్జునకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా అవుతుంది. అయితే ఇప్పుడు వరకు నాగార్జున సినీ సెలబ్రిటీలో చనిపోయిన ఆఖరి చూపుకి కూడా నాగార్జున రాలేదు. అంతేకాదు చనిపోయిన అనంతరం కనీసం కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి కూడా నాగార్జున వెల్లడు.

ఇక ఈ విషయమై నాగార్జునని చాలామంది విమర్శించారు కూడా. అయితే ఇటీవల కైకాల సత్యనారాయణ మరణించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక అక్కడ కూడా నాగార్జున రాలేదు. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు హాజరైనప్పటికీ నాగార్జున మాత్రం అక్కడికి రాలేదు. ఎంతో గొప్ప పేరు ఉన్న నటుడు కృష్ణంరాజు మరణించిన సమయంలో కూడా నాగార్జున చివరి చూపుకి రాలేదు. అయితే నాగార్జున తండ్రి నాగేశ్వరరావు మరియు తల్లి అన్నపూర్ణ దేవి చనిపోయిన సమయంలో చాలామంది రాజకీయ ప్రముఖులు మరియు సినీ సెలబ్రిటీలు సైతం హాజరవ్వడం జరిగింది.కానీ నాగార్జున మాత్రం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎవరు చనిపోయినప్పటికీ కనీసం ఆఖరి చూపు కూడా రావడం లేదు. దీంతో ఎందుకు నాగార్జున రావడం లేదు అని సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. దీంతో ఈ టాపిక్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: