‘ధమాకా’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈసినిమాకు కలక్షన్స్ బాగా వస్తూ ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. రవితేజా కెరియర్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలలో ‘ధమాకా’ కూడ నిలబడుతుంది అని అంటున్నారు. దసరా తరువాత మాస్ సినిమాలు ఏవి విడుదలకాలేదు.


గడిచిన రెండు నెలలలో ఎక్కువగా దెయ్యాల సినిమాలు లవ్ స్టోరీలు మాత్రమే వచ్చాయి. దీనితో మాస్ సినిమా గురించి ఎదురు చూస్తున్న సగటు ప్రేక్షకుడి కోరికను ‘ధమాకా’ తీర్చింది అన్న విశ్లేషణలు వస్తున్నాయి. సాధారణంగా ధియేటర్లలో హీరోలు మాస్ స్టెప్స్ వేస్తున్నప్పుడు మాస్ ప్రేక్షకుడు ఈలలు వేయడం పరిపాటి. అయితే ఈమూవీలో శ్రీలీల స్టెప్స్ ను చూసి మాస్ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేయడమే కాకుండా బిసి సెంటర్లలో ప్రేక్షకులు శ్రీలీల లను చూసి ఈలలు వేయడం షాకింగ్ న్యూస్ గా మారింది.


వాస్తవానికి శ్రీలీల మంచి క్లాసికల్ డాన్సర్ అని అంటారు. రవితేజా పక్కన పోటాపోటీగా నటించి యాక్టివ్ గా కనిపించిన శ్రీలీల లను చూసిన వారు కనీసం మూడు సంవత్సరాలు శ్రీలీల హవా ఇండస్ట్రీలో కొనసాగుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న టాప్ హీరోయిన్స్ అందరూ 30 సంవత్సరాల వయసు పై బడిన వారు. దీనితో వయసు రీత్యా కూడ శ్రీలీల కు మంచి అవకాశం ఉంది అంటున్నారు.


ప్రస్తుతం ‘ధమాకా’ కలక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ ఈమూవీ అసలు పరిస్థితి సోమవారం నుండి తేలిపోతుంది అని అంటున్నారు. ముఖ్యంగా ఈమూవీతో శ్రీలీల కు బ్రేక్ వచ్చినప్పటికీ జూనియర్ మహేష్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ ల పక్కన ఈమె ఎంతవరకు సూటు అవుతుంది అన్న విషయమై ఈమె కెరియర్ ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ‘ధమాకా’ మూవీ రవితేజా కు ఇటు శ్రీలీల కు జోష్ ను కల్గించడంతో ప్రస్తుతం వారిద్దరూ చాల ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది..




మరింత సమాచారం తెలుసుకోండి: