యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కే జి ఎఫ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది.మొదట మోడలింగ్ రంగం నుంచి తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె 2017 మిస్ కర్ణాటక మిస్ బ్యూటిఫుల్ స్మైల్ , 2016 లో మిస్ సూపర్ నేషనల్ ఇండియన్ టైటిల్ను గెలుచుకుంది. అలా మోడలింగ్ నుంచి తన ప్రతిభను చూపిస్తూ 2018లో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ అనిల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ చిత్రంతో ఈమె మరింత పాపులర్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఇందులో శ్రీనిధి పర్ఫామెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ చిత్రం తర్వాత ఈమె అదృష్టం బాగా కలిసొస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈమె రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ఉండడంతో వచ్చిన అవకాశాలన్నీ కూడా చేజారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఇన్నాళ్లుగా గ్లామర్ షో తో కనువిందు చేసిన ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది.


ఇప్పుడు ఆరంజ్ చీరకట్టులో ఉండేటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయగా ఈమె అందంతో కుర్రకారులు చూపు తిప్పనివ్వకుండా చేస్తోంది. ముఖ్యంగా తన అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. కన్నడ బ్యూటీ అయినా తెలుగు ప్రేక్షకులను బాగా కట్టిపడేసేలా చేస్తోంది. ఇటీవల గ్లామర్ డోర్స్ పెంచుతూ వస్తున్న శ్రీనిధి వరుస ఫోటోషూట్లతో బాగానే సందడి చేస్తోంది. ఇక తన రెండో చిత్రం తమిళ హీరో విక్రమ్ నటించిన కోబ్రా సినిమాలు అవకాశం సంపాదించుకుంది. దాదాపుగా ఈ సినిమాకు నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: