మాటీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ ఒకటి నుండి నిన్న ముగిసిన సీజన్ 6 వరకు ఈ షో ఎంతటి ఆదరణను అందుకుందో మనందరికీ తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ షో ని అందరూ వీక్షిస్తూ ఉంటారు.అయితే గత కొన్ని రోజులుగా మళ్లీ ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి పోస్ట్ గా నాగార్జున ఉండకపోవచ్చు అన్న వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక చాలా సీజన్లకి హోస్టుగా వ్యవహరించిన నాగార్జున ఈ సీజన్ కి హోస్ట్ గా రాకపోవడంతో అక్కినేని అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు.

ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ హోస్ట్గా నందమూరి బాలకృష్ణ అయితే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈ షో కి హోస్టుగా రానా దగ్గుపాటి అయితే కూడా బాగుంటుంది అని చాలామంది కామెంట్లు సైతం చేస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంతని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ టీం సమంతతో సంప్రదింపులు జరిపిందని సమంత అయితే ఈ షో కి చాలా ప్లస్ అవుతుందని దానితోపాటు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన అనంతరం సమంత ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది.

అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కూడా సమంత స్టార్డం మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. అయితే గతంలో  అక్కినేని నాగార్జున షూటింగ్లో బిజీగా ఉండడంతో అప్పట్లో సమంత హోస్ట్ గా వ్యవహరించిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రారంభమయ్యే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి హోస్ట్ గా చేయడానికి ఈ అనుభవం ఉంటే సరిపోతుంది అని బిగ్ బాస్ టీం అభిప్రాయపడుతుందట. ఇందుకుగాను బిగ్ బాస్ టీం సమంతను సంప్రదించినట్లుగా కూడా ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే తప్ప బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సమంత హోస్ట్గా వ్యవహరిస్తుందా లేదా అన్న విషయంపై క్లారిటీ రాదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: