మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సంవత్సరం ఆచార్య మరియు గాడ్ ఫాదర్ మూవీ లతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. గాడ్ ఫాదర్ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ లో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించగా ... బాబీమూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది వరకే బాబి ... రవితేజ హీరోగా తెరకెక్కిన పవర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. వాల్తేరు వీరయ్య మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించగా ... శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటించింది. బాబీ సింహా ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ను మరియు అద్భుతమైన పాటలను ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన బాస్ పార్టీ ... శ్రీదేవి చిరంజీవి ... వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూడు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా విడుదల చేసిన వాల్తేరు వీరయ్య మూవీ టైటిల్ సాంగ్ ఇప్పటికే  7.2 మిలియన్ వ్యూస్ ను , 190 కే లైక్ లను సాధించి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: