ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఇంత వయసు వచ్చిన కూడా ఇప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఆయన నటిస్తున్న సినిమాలకి సంబంధించి అన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఆయన పెళ్లికి సంబంధించిన వార్తలు మాత్రం ఇప్పటివరకు ఒక్కటి కూడా బయటకు రానివ్వలేదు ప్రభాస్. ఈయన పెళ్లికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా అనేక రకమైన రూమర్లు వచ్చాయి. ఇటీవల ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా చనిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. 

ఇక ఆ సమయంలో తన చెల్లెల్ల పెళ్లిళ్లు చేసిన తర్వాతే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అన్న వార్తలు సైతం రావడం జరిగింది. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా పూర్తి అయిన వెంటనే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అని వార్తలు కూడా వచ్చాయి.కానీ ఆ వార్తలు ఇప్పటికీ నిజం కాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ పెళ్లి చేసుకోక పోవడానికి ఒక స్టార్ హీరోయిన్ అన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయాన్ని తన తల్లి తన స్నేహితుల దగ్గర చెప్పినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ప్రభాస్ కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు.

ఇక అలా ఉన్న స్నేహితులలో రవి కూడా ఒకరు. అయితే ఆయన ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న సమయంలో ఆ అమ్మాయి తనని మోసం చేసిందట.ఇక ఈ విషయాన్ని ప్రభాస్ దగ్గర ఆయన చెబుతూ బాధపడుతూ ఉండేవాడట. ఇక ఆ అమ్మాయి చేసిన మోసం కారణంగా ప్రభాస్ స్నేహితుడు రవికి 45 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉన్నాడట. దీనికి కారణం ఈ అమ్మాయి మోసం చేసినట్లు గా అందరూ చేస్తారని ఆయన అభిప్రాయపడుతున్నారు.ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అని ప్రభాస్ తల్లి తన స్నేహితుల దగ్గర చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం నిజమో కాదో తెలియదు కానీ ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఈ వార్త అయితే  సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: