టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈయన సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపును పొందాడు. దాని అనంతరం బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియా గుర్తింపును పొందాడు. కేవలం 12 13 సినిమాలు ఈయన చేసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మంచి దర్శకుడుగా గుర్తింపును పొందాడు. ఇటీవల విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకున్న ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఫ్యాన్ ఇండియా సినిమాగా రికార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా. ఆస్కార్ వరకు వెళ్లిన ఈ సినిమాతో రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని అనంతరం త్రిబుల్ ఆర్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హాలీవుడ్ నిర్మాత సంస్థలు సైతం ఈయనతో ఒప్పందం కుదిర్చుకునేందుకు రావడం జరిగింది. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమాను చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే.దీనికిగాను ఆయనకి ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా మహేష్ బాబు సినిమాను దృష్టిలో పెట్టుకొని ఏ ఆఫర్ ని కూడా అంగీకరించడం లేదట రాజమౌళి.

 ఇక అసలు విషయానికి వస్తే ఈ నేపథ్యంలోనే రాజమౌళికి ఏకంగా 100 కోట్ల ఆఫర్ ను రాజమౌళి వదులుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే నెట్ఫ్లిక్స్ వారు రాజమౌళికి ఏకంగా 100 కోట్ల ఆఫర్ ను ఇవ్వడం జరిగిందట. ఇందుకు గాను ఇంగ్లీష్ లేదా ఏదైనా ఇతర భాషల్లో వెబ్ సిరీస్ తీసే అవకాశాన్ని రాజమౌళికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇందుకోసం రాజమౌళి ఎంత రెమ్యూనరేషన్ అడిగితే అంత ఇస్తామని కూడా నెట్ఫ్లిక్స్ వారు రాజమౌళికి చెప్పడం జరిగింది. కానీ మహేష్ బాబు సినిమాని దృష్టిలో పెట్టుకొని అంతటి భారీ ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేశాడట రాజమౌళి. దీనికిగాను ఇప్పుడు ఈ వార్త విన్న చాలామంది మహేష్ బాబు కోసం రాజమౌళి ఏకంగా 100 కోట్లు ఆఫర్లు సైతం వదులుకున్నాడు అన్న కామెంట్లు చేస్తున్నారు. మహేష్ తో రాజమౌళి ప్రాజెక్టు పూర్తి అయిన తరువాతే మరి ఏదైనా ప్రాజెక్ట్ చేయాలన్న ఉద్దేశంలో రాజమౌళి ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: