టాలీవుడ్ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోస్ లో ఒకరైన నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. నిజానికి గత సంవత్సరం 2022లో బాలయ్య నటించిన ఒక్క సినిమా కూడా థియేటర్స్ లో విడుదల కాలేదు. దీంతో 2022 బాలయ్యకు ఖాళీ క్యాలెండర్ గా మిగిలింది. కానీ 2023 సంవత్సరం మాత్రం అలా కాదు. 2023లో బాలకృష్ణ గారి నుంచి వరుస సినిమాలు రాబోతున్నాయి. బాలయ్య నటిస్తున్న రెండు సినిమాలు ఏకంగా థియేటర్స్ లో విడుదల కానున్నాయి. అందులో 'వీర సింహారెడ్డి' ఒకటి. గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా మరో పది రోజుల్లోనే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. 

జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కంప్లీట్ మాస్ యాక్షన్ ఫ్యాక్షన్ ఎంటర్టైన్ గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా అనంతరం బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబో మూవీ ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. వేసవిని టార్గెట్ గా చేసుకొని షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ లేదా మే నెలలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అనిల్ రావిపూడి సినిమా షూట్ పూర్తయిన తర్వాత బాలకృష్ణ..

బోయపాటి శ్రీను తో ఓ సినిమా చేయబోతున్నారు. 14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అంతేకాదు 2024 ఎన్నికలకు ముందే బోయపాటి సినిమా కూడా థియేటర్స్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే మొత్తంగా చూసుకుంటే కేవలం 16 నెలల్లోనే ఏకంగా మూడు భారీ సినిమాలు విడుదల చేయబోతున్నారు బాలయ్య. అలా తన కెరీర్ ని బాలయ్య ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో సినిమాల విషయంలో బాలయ్య స్పీడ్ పెంచడంతో ఫాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఒక్కో సినిమాకి 12 కోట్ల నుంచి 20 కోట్ల రేంజ్ లో సినిమాను బట్టి పారితోషికాన్ని తీసుకుంటున్నారట బాలయ్య. అఖండ సినిమాతో బాలయ్య మార్కెట్ కూడా పెరిగిపోయింది. అందుకే ప్రస్తుత సినిమాలన్నీ కూడా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తోనే రూపొందుతున్నాయి. మొత్తం మీద సినిమా సినిమాకి తన మార్కెట్ ను పెంచుకుంటూ, వరుస విజయాలు అందుకుంటూ బాలయ్య తన కెరీర్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉండడం విశేషం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: