సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఒక హీరో దగ్గరకు వచ్చిన కథ రిజెక్ట్ అయి మరో హీరో దగ్గరకు వెళ్లి అది బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే.. ఎప్పటినుంచో అనుకుంటున్నా త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ 2018 సంవత్సరం అక్టోబర్ లో వచ్చింది. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి వంటి భారీ డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం నుండి వచ్చిన ఈ సినిమా మీద వాస్తవంగా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు సినీ జనాలు. 

కానీ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా 'అరవింద సమేత వీర రాఘవ' భారీ కమర్షియల్ హిట్ అందుకుంది. ఏకంగా 150 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్  ప్రేక్షకులను థియేటర్స్ లో విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటిదాకా క్లాస్ సినిమాలతో ఆకట్టుకున్న త్రివిక్రమ్..

అరవింద సమేత లో భారీ యాక్షన్స్ సీన్ ని అద్భుతంగా తెరకెక్కించడంతో అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యాడు. అయితే నిజానికి ఈ సినిమా కథ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాడట త్రివిక్రమ్. అజ్ఞాతవాసి ప్లాప్ తో ఫ్యాన్స్ ని దారుణంగా నిరుత్సాహపరిచిన ఆయన ఎలాగైనా మళ్ళీ పవన్ కళ్యాణ్ కి ఒక భారీ సక్సెస్ ఇవ్వాలనే కసితోనే 'అరవింద సమేత' స్టోరీని రాసి మొదట పవన్ కళ్యాణ్ కి వినిపించాడట. కానీ పవన్ కళ్యాణ్ ఈ కథ విన్న తర్వాత ఇది నా కంటే జూనియర్ ఎన్టీఆర్ కి బాగా సెట్ అవుతుందని.  ఎన్టీఆర్ చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందని.. మనం ఇంకో సినిమా చేద్దామని.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథ జూనియర్ ఎన్టీఆర్ కి నచ్చితే చేసేయని పవన్ కళ్యాణ్ చెప్పడంతో వెంటనే ఎన్టీఆర్ కి కథ వినిపించాడట త్రివిక్రమ్. దీంతో తారక్ కథ వినగానే వెంటనే ఓకే చేసేయడం.. సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: