'పెళ్ళిసందD' సినిమాలో శ్రీకాంత్ కొడుకు అయిన రోషన్, కన్నడ కథానాయిక అయిన శ్రీలీల లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ స్టోరీ ఎంత చెత్తగా ఉన్నా రోషన్-శ్రీలీల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అయితే బాగా పండి బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది.

ఈ సినిమాతోనే హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీకాంత్ కొడుకు రోషన్, శ్రీలీల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుతోనే శ్రీలీలకు తెలుగులో వరుస అవకాశాలు అయితే రావడానికి కారణం అయింది. ఈ ముద్దుగుమ్మ రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించగా అది పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో ఈ కన్నడ కుట్టి తన అందం మరియు డ్యాన్స్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

సినిమా కాక ప్రస్తుతం ఈ భామ బాలయ్య సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. అనగనగా ఒక రాజు, జూనియర్ అనే సినిమాల్లో కూడా ఈ అమ్మడు చేస్తోంది. ధమాకా సినిమాతో హిట్టు కొట్టింది కాబట్టి తెలుగులో ఈ అమ్మడుకి మరిన్ని అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగు డెబ్యూ ఫిలిం 'పెళ్ళిసంద-డి'తో శ్రీ లీల కెరీర్ మారిపోతే.. హీరో రోషన్ మాత్రం పూర్తిగా కనుబడుట లేదు.ఈ సినిమా వచ్చి సంవత్సరానికి పైగా  గడిచిపోతుంది. అయినా కూడా అతని నుంచి ఒక్క కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ కు నోచుకోలేదు .

21 ఏళ్ల శ్రీలీల కెరీర్ చక్కగా ప్లాన్ చేసుకొని దూసుకెళ్తున్న వేళ ఆమెతో కలిసి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ కొడుకు ఇలా ఫేడౌట్ కావడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి.ఒక మంచి స్క్రిప్ట్ ఎంచుకోవడానికి సంవత్సరం కంటే అతడు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడా? సినిమాల్లో కొనసాగే ఉద్దేశం ఉందా? ఇంత గ్యాప్ తీసుకుంటే ఈ కుర్రాడిని అందరూ మర్చిపోవడం ఖాయం అంటూ కూడా చాలామంది వారి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా హ్యాండ్సమ్ లుక్స్ ఉండి కూడా రోషన్ తన తండ్రి లాగా సినిమాలలో సక్సెస్ అవుతాడా లేదా మరి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: