చందమామ కాజల్ అగర్వాల్ దాదాపు చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సంగతి తెల్సిందే. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు తెలుగు సినీ లోకం కూడా తడిసి ముద్ద అయ్యింది.

అమ్మడికి స్టార్ హీరోల స్థాయి లో మంచి ఆధరణ అయితే లభించింది. అన్ని వర్గాల వారిని అలరించిన కాజల్ అగర్వాల్ సాధ్యం అయినంత వరకు ఎక్కువ మంచి సినిమాలు మాత్రమే చేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయంలో కాస్త ఇబ్బంది పడిన కూడా కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం స్టార్ డమ్ తెచ్చుకుంది. అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ మరోసారి తన యొక్క అందాల ఆరబోత తో ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది. ముఖ్యంగా ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమా ల్లో మళ్లీ నటించాలి అని అయితే కోరుకుంది. కానీ ఇప్పటి వరకు ఈ అమ్మడి యొక్క కొత్త సినిమా లు ఏ ఒక్కటి కూడా కన్ఫర్మ్ కూడా అవ్వలేదని తెలుస్తుంది.

పెళ్లి ఆ తర్వాత తల్లి అవ్వడంతో కాజల్ అగర్వాల్ ను తెలుగు దర్శక నిర్మాతలు అస్సలు పట్టించుకోవడం లేదట.. సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రేక్షకులు మరియు ఫిల్మ్ మేకర్స్ వారు పెళ్లి అయిన వారికి పెద్దగా ప్రాముఖ్యత ను అస్సలు ఇవ్వరు. అందుకే ఈ అమ్మడు అస్సలు సినిమా ల్లో ఆఫర్లు దక్కించుకోవడం లేదు. బాలీవుడ్ లో పెళ్లి అనే విషయాన్ని అస్సలు పట్టించుకోరు. కనుక ఈ అమ్మడు హిందీ లో ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. సోషల్ మీడియాలో ఈ అమ్మడు హాట్ ఫొటో షూట్స్ ను షేర్ చేస్తూ గతంలో కంటే కూడా అధికంగా అందంగా ఉన్నాను అంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ యొక్క అందాన్ని మళ్లీ వెండి తెరపై ఎప్పుడు చూస్తామో అంటూ ఆమె అభిమానులు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: