ఈసారి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ అన్నీ విడుదల కావడంతో ఈ ట్రైలర్స్ లో ఏ ట్రైలర్ బాగుంది అన్నచర్చలు జరుగుతున్నాయి. ఈసారి సంక్రాంతికి విడుదల కాబోతున్న నాలుగు భారీ సినిమాలు పూర్తి రొటీన్ మాస్ సినిమాలు మాత్రమే అన్నసంకేతాలు ఈట్రైలర్స్ చూసిన వారికి కలుగుతున్నాయి.

 

 

ఈసారి సంక్రాంతి రేస్ లో ఉన్న సినిమాలు అన్నీ మాస్ సినిమాలు కావడంతో ఆసినిమాలు అన్నీ ఆహీరో ఇమేజ్ పై ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి సంక్రాంతి రేస్ చిరంజీవి బాలకృష్ణల వార్ గా మారడంతో ఈ రెండు సినిమాలలో ఏసినిమా సంక్రాంతి విజేత కాబోతోంది అన్నచర్చలు మొదలయ్యాయి. ‘వీరసింహా రెడ్డి’ ట్రైలర్ చూసిన వారికి గతంలో బాలకృష్ణ నటించిన అనేక ఫ్యాక్షన్ సినిమాల ఛాయలు కనిపిస్తాయి.

 

 
ఇక ‘వాల్తేర్ వీరయ్య’ విషయానికి వస్తే అది పూర్తి రొటీన్ సినిమా అనీ ఎలాంటి కొత్తదనం ఆశించవద్దు అంటూ స్వయంగా చిరంజీవి చెపుతూ ఉండటంతో ఆమూవీ గురించి కూడ ఒక క్లారిటీ ఏర్పడింది. విజయ్ నటించిన ‘వారసుడు’ మూవీ ట్రైలర్ చూసిన వారికి ఇలాంటి కథలతో చాల సినిమాలు గతంలో వచ్చాయి కదా అన్నసందేహాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈమూవీలో కోలీవుడ్ టాప్ హీరో విజయ్ లుక్ లో కూడ ఎటువంటి మార్పు కనిపించక పోవడంతో ఈసినిమా పై అంచనాలు పెట్టుకోకుండా కేవలం విజయ్ మ్యానరిజమ్స్ గురించి ఆమూవీకి వెళ్ళాల అన్నసందేహాలు ఏర్పడతాయి.

 

 
అజిత్ ‘తెగింపు’ ట్రైలర్ ను చూసిన వారికి సినిమాలో కేవలం యాక్షన్స్ సీన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈట్రైలర్ లో చాలసేపు అజిత్ తన గన్ తో కనిపిస్తూ ఉండటంతో ఈమూవీ అజిత్ నుండి వస్తున్న మరొక యాక్షన్ మూవీ మాత్రమే అన్న అంచనాలు కలిగేలా చేస్తున్నాయి. ఇలా సంక్రాంతి రేస్ కు వస్తున్న టాప్ హీరోల సినిమాలు అన్నీ మాస్ సినిమాలుగా ఉండటంతో ఎటువంటి వెరైటీ ఆశించకుండా సగటు ప్రేక్షకుడు ఇన్ని మాస్ సినిమాలు వరసపెట్టి చూస్తాడా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: