పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం సలార్‌. కేజీఎఫ్‌ మూవీతో ఒక్కసారిగా యావత్ దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.కేజీఎఫ్‌ సినిమాలో యష్‌ను ఓ రేంజ్‌లో చూపించిన ప్రశాంత్‌ నీల్‌.. ఇక ప్రభాస్‌ను ఎలా చూపించనున్నాడన్న ఆసక్తి అందరిలో కూడా నెలకొంది. ముఖ్యంగా ప్రభాస్‌ అభిమానులు ఈ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ ఏకంగా 85 శాతం పూర్తి చేసుకుంది.ఇదిలా ఉంటే తాజాగా మూవీ యూనిట్ ఈ విడుదలకు సంబంధించి ఇంట్రెస్టింట్ అప్‌డేట్ ఇచ్చింది. సలార్‌ సినిమాని ఈ ఏడాదిలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘2023 ఏడాది కాదు సలార్‌’ (2023 సాల్‌ నహి, సాలార్‌ హై) అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఉన్న పోస్టర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


ఇక ఇదిలా ఉంటే నిజానికి సలార్‌ మూవీ కంటే ముందుగానే ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.అయితే ఆదిపురుష్‌ సినిమా గతేడాది డిసెంబర్‌ నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే సినిమాకు భారీగా వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ ఉండడం ఇంకా అలాగే చిత్ర యూనిట్ కూడా మేకింగ్ విషయంలో జాగ్రత్తలు పడడంతో విడుదల అనేది చాలా ఆలస్యమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే... ఆదిపురుష్‌ సినిమా సలార్‌ సినిమా తర్వాతే విడుదల కానున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రభాస్‌ నటిస్తోన్న మరో సినిమా కూడా ఇదే ఏడాదిలో విడుదల కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: