ప్రపంచం మొత్తం మెచ్చిన దర్శకుడు మరియు ఇప్పటివరకు ఫ్లాప్ సినిమాలు ఎదురులేని దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దర్శక ధీరుడు రాజమౌళి. ఇక శాంతినివాసం అనే సీరియల్ ద్వారా దర్శకుడిగా తన కెరీర్ను మొదలుపెట్టాడు రాజమౌళి. ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందాడు. అయితే ఒక సాధారణ డైరెక్టర్గా తన కెరియర్ను మొదలుపెట్టి ఇంతటి అరుదైన స్థానాన్ని రాజమౌళి అందుకోవడం మనమందరం గర్వించదగ్గ విషయం. ఇక ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమాతో తన సత్తాను చాటాడు దర్శకధీరుడు.  

దాని అనంతరం ఇటీవల విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు రాజమౌళి. అంతేకాదు ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆస్కార్ బరిలో కూడా నిలిచేలా చేశాడు రాజమౌళి. ఇక ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉండడంతో విదేశాలలో సైతం మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఈ సినిమా విడుదలై ఇన్నాళ్లు కావస్తున్నప్పటికీ విదేశీయులు సైతం ఈ సినిమాపై ఇంకా ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అయితే రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. మంచి విజయంతో పాటు భారీ స్థాయి కలెక్షన్లను కూడా వసూలు చేశాయి. అయితే రాజమౌళి తెరకెక్కించిన చాలావరకు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం ఆయనకు నష్టాలను తెచ్చిపెట్టాయి.

ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సై సినిమా రాజమౌళికి భారీ నష్టాన్ని మిగిల్చిం.ది నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కాలేజీ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. యువతకు ఈ సినిమా బాగా నచ్చినప్పటికీ యావరేజ్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా కలెక్షన్లు కూడా అంతగా రాలేదు. కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాతో బాగా నష్టాలు వచ్చి పడ్డాయి. అప్పట్లో ఈ సినిమాని ఆరు కోట్ల బడ్జెట్ తో నిర్మించగా కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్షన్ను అందుకుంది. సాధారణంగా రాజమౌళి దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తుంది అంటే ఆ సినిమా కచ్చితంగా బడ్జెట్ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్ను సాధిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాజమౌళి కెరియర్ లో తక్కువ కలెక్షన్ సాధించిన సినిమాగా సై సినిమా నిలిచింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: