భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో తన హవా నడిపించి అతిలోక సుందరిగా పేరు సంపాదించుకుంది శ్రీదేవి. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రీదేవి ఇక తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది అన్న విషయం తెలిసిందే. చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఏకంగా తన తండ్రి వయస్సున్న హీరోలతో సైతం నటించి పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది. మొత్తంగా సినిమా ఇండస్ట్రీలో 300 పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎవ్వరు చూసినా కూడా శ్రీదేవి నటన గురించి ఆమె అందం అభినయం గురించి పోగొడ్తలు కురిపించిన వారే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.


 కానీ శ్రీదేవి గురించి ఏకంగా సెన్సేషనల్ కామెంట్స్ చేసిన దర్శకులు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారూ అని చెప్పాలి. కానీ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న ఒక వ్యక్తి ఒకప్పుడు శ్రీదేవి బతికున్నప్పుడే ఏకంగా ఆమెపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారట. ఇలా శ్రీదేవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు ఎవరో కాదు ప్రస్తుతం ప్రపంచం  మొత్తం ఎరిగిన రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిన చిత్రం బాహుబలి. అయితే ఈ సినిమాలో ముందుగా శివగామి పాత్ర కోసం శ్రీదేవిని అనుకున్నారట.


 అయితే శ్రీదేవి మాత్రం ఇక ఈ పాత్ర కోసం 10 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆమె షూటింగ్ కి రావడానికి రాను పోను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలని అంతేకాకుండా ఆమె బస చేయడానికి ఫైవ్ స్టార్ హోటల్లో సౌకర్యాలు కల్పించాలంటూ ఆమె మేనేజర్ డిమాండ్ చేశాడట. ఈ క్రమంలోనే మా ప్రొడ్యూసర్లకు ఒక పాత్ర కోసం అంత బడ్జెట్ పెట్టడం వర్కౌట్ కాదు. అందుకనే ఇక మా సినిమాలో  శివగామి పాత్ర కోసం శ్రీదేవిని తీసుకోలేదు అంటూ రాజమౌళి గతంలో ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయంపై అప్పట్లో శ్రీదేవి స్వయంగా స్పందించి నేను ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టే దాన్ని అయితే 300 సినిమాల్లో నటించేదాన్ని కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: