ఆస్కార్స్ 2023 కి మన ఇండియన్ సినిమాలు నామినేట్ అయ్యాయి. బాలీవుడ్ నుంచి చెల్లో షో,కాశ్మీర్ ఫైల్స్, గంగుబాయ్ కతియావాడి సినిమాలు నామినేట్ అవ్వగా టాలీవుడ్ నుంచి ఆర్ ఆర్ ఆర్ సినిమా నామినేట్ అయ్యింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా కన్నడ సినిమా కాంతార నామినేట్ అయ్యి సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన ఈ సినిమా కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కి దేశావ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది.ముందుగా కన్నడ భాషలో విడుదల అయ్యి.. అక్కడ సూపర్ హిట్ కొట్టి తర్వాత మిగిలిన పలు భాషల్లో రిలీజ్ అయ్యింది ఈ మూవీ. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీపై దేశావ్యాప్తంగా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి నటన అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.


ముఖ్యంగా క్లైమాక్స్ లో 20 నిముషాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్న కాంతార మూవీ ఇప్పుడు ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచి ఇండియన్ లవర్స్ గర్వపడేలా చేసింది.కాంతార ఆస్కార్ కు నామినేట్ అయ్యిందని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ప్రకటించడం జరిగింది. కాంతార సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. బెస్ట్ మూవీ అవార్డు ఇంకా బెస్ట్ యాక్టర్ అవార్డులకు గాను కాంతార ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో చిత్రయూనిట్ చాలా ఆనందం వ్యక్తం చేసింది.కన్నడ ప్రజల సంప్రదాయమైన భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన కాంతార సినిమాకు రిషబ్ శెట్టినే దర్శకత్వం వహించి నటించారు. ఈ మూవీలో రిషబ్ శెట్టి నటన నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. త్వరలో ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో కూడా ఉన్నారు నిర్మాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: