మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు అందరిని మాయ చేసేసింది . ఇక ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది. ఇప్పుడు ఇండస్ట్రీ లోకి వచ్చి దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా తన హవా కొనసాగిస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకవైపు హీరోల సరసన నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ దూసుకుపోతుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల శాకుంతలం అనే సినిమాలో నటించగా.. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


 కాగా ప్రస్తుతం సమంత మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతుంది. గత కొంతకాలం నుంచి ఎక్కడ బయటికి రాకుండా చికిత్స తీసుకుంటుంది. ఇక ఇటీవల  శాకుంతలం ప్రమోషన్స్ లో పాల్గొంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే సమంత ఇక ఎంతగానో ప్రేమించిన భర్త నుంచి వేరు కావడం.. అంతలోనే ఒక మాయదారి వ్యాధి బారిన పడటం..ఇలా సమంత విషయంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా అభిమానులను ఆందోళన కలిగిస్తుంది అని చెప్పాలి. దీంతో ఎంతో మంది  సమంతకు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన సలహాలు కూడా ఇస్తున్నారు అని చెప్పాలి.


 ఇటీవల సమంతకు వీరాభిమాని అయిన ఒక నెటిజన్ కూడా ఇక సమంతకు ఇలాంటి ఒక సలహా ఇచ్చాడు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల శాకుంతలం సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దిగిన కొన్ని ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఈ ఫోటోలు పై స్పందించిన ఒక నేటిజన్.. నువ్వు ఒంటరిగా ఉండి ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ బాగున్నావ్ అని అనుకుంటున్నావు. కానీ సమంత దయచేసి నీ పరిస్థితి అర్థం చేసుకొ.. నువ్వు చైతన్యన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడం మంచిది అంటూ ఒక సలహా ఇవ్వడమే కాదు ఇక తన కామెంట్లకి నాగచైతన్యను కూడా ట్యాగ్ చేసి సమంతకు షాక్ ఇచ్చాడు నేటిజన్. అభిమాని ఇలా అడగడంతో సమంత కూడా షాక్ అయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: