టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా రాజమౌళిని అభిమానించేవారు కోట్లలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న స్టార్ హీరో హీరోయిన్లు సైతం రాజమౌళిని అభిమానిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇలా ఒక డైరెక్టర్ని ఇష్టపడేవారు ఉండేవారు కాదు .కానీ ఇప్పుడు రాజమౌళికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. రాజమౌళి సినిమా అంటేనే ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడే ఎన్నో అద్భుతమైన సినిమాలను తీస్తున్న రాజమౌళి ముందు ముందు మరెన్నో అద్భుతమైన సినిమాలను తీస్తాడు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

ఆయన చేసే సినిమాల్లో ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరిస్తారు రాజమౌళి. అందుకే ఆయనకు కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్ సైతం రాజమౌళి అంటే ఇష్టమని చెప్పాడు. అయితే తాజాగా సుకుమార్ తన సోషల్ మీడియా వేదికగా రాజమౌళి ఫోటోను షేర్ చేస్తూ.. నా హీరో అంటూ ఒక క్యాప్షన్ ని కూడా పెట్టాడు సుకుమార్.ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకేకించిన పుష్ప వంటి సినిమాతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపును పొందాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాతో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది.

ఇక అలాంటి ఒక స్టార్ డైరెక్టర్ తో రాజమౌళి మై హీరో అని అనిపించుకున్నాడు అంటే రాజమౌళి స్థాయి ఏంటో అర్థం అవుతోంది. సాధారణంగా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వీరి సినిమాలు వస్తే ఒకరి సినిమా కోసం మరొకరు ప్రమోట్ చేసుకుంటూ ఉండడం మనం చాలా సందర్భాల్లో చూసాం. చాలా సందర్భాల్లో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉంటారు .అయితే తాజాగా రాజమౌళి నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో సుకుమార్ తన సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ ను షేర్ చేశాడు.ఇక ఈ అవార్డు ప్రకటనకు కొన్ని గంటల ముందు సుకుమార్ ఈ పోస్టుని షేర్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: