అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన ‘వీరసింహారెడ్డి’ మూవీ ఆశించిన స్థాయిలో లేదు అన్నమాటలు ఈమూవీ విడుదలైన మొదటిరోజు ప్రీమియర్ షోల నుండి వస్తూ ఉండటంతో బాలయ్య సెంటిమెంట్ మరొకసారి రిపీట్ అయిందా అన్నసందేహాలు కొందరికి కలుగుతున్నాయి. గత 20 సంవత్సరాలుగా బాలకృష్ణ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే అతడికి ఒక హిట్ వచ్చిన తరువాత మరొక సూపర్ హిట్ రావడానికి చాల సమయం పడుతోంది.

ఇప్పుడు ఇదే విషయం ‘వీరసింహారెడ్డి’ విషయంలో నిజం అవుతుందా అన్న ప్రాధమిక అంచనాలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించి ఓవర్సీస్ ప్రేక్షకులు వెలుబుచ్చిన అభిప్రాయాల ప్రకారం ఈమూవీ చాల రొటీన్ సినిమా అని సంకేతాలు వస్తున్నాయి. అంతేకాదు ఈమూవీలో విలన్ గా నటించిన దునియా విజయ్ విలనిజమ్ చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి.


ఇక హీరోయిన్ శ్రుతిహాసన్ పాత్ర చాల చిన్నదని కామెంట్స్ కూడ వస్తున్నాయి. ముఖ్యంగా ఈమూవీ సెకండ్ హాఫ్ చాల భారంగా నడిచింది అన్న టాక్ కూడ ఓవర్సీస్ టాక్ లో వినిపిస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య తో తీసిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు రొటీన్ కథను ఎంచుకోవడం కూడ ఒక విధంగా ఈమూవీకి డివైడ్ టాక్ రావడానికి కారణం అని అంటున్నారు. అయితే ఈమూవీ మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చే ఆస్కారం ఉందని కామెంట్స్ వస్తున్న పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలోని బిసి సెంటర్ల ప్రేక్షకులు ఈమూవీ పై ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారు అన్నది ఈ పండుగ పూర్తి అయితే కాని క్లారిటీ రాదు.


రేపు విడుదల కాబోతున్న ‘వాల్తేర్ వీరయ్య’ టాక్ ను బట్టి ‘వీరసింహారెడ్డి’ పరిస్థితి ఆధారపడి ఉంటుంది. చిరంజీవి సినిమాకు బ్లాక్ బష్టర్ హిట్ టాక్ వస్తే ‘వీరసింహారెడ్డి’ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకోవలసి వస్తుంది. అయితే ఈ టాక్ తో సంబంధం లేకుండా బాలయ్య అభిమానులు మాత్రం ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అంటూ ధియేటర్ల బయట సందడి చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: