టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత అంతటి అంచనాల అందుకున్న సినిమా ఇదే అన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ మధ్యలో ఆచార్య సినిమాతో పెద్ద డిజాస్టర్ అందుకున్నప్పటికీ గాడ్ ఫాదర్ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు. అలా చిరంజీవి ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సమయంలో వాల్తేర్ వీరయ్య సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఇక వాల్తేర్ వీరయ్య నుంచి ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా ప్రీమియం షోలలో పాల్గొన్న సినీ ప్రముఖులు వాళ్ల నుంచి వచ్చిన టాక్ కూడ పాజిటివ్ గానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి నుంచి మాస్ ఆడియన్స్ అభిమానులు కోరుకునేది ఒక కమర్షియల్ సినిమా .మెగాస్టార్ మార్కు కామెడీ టైమింగ్ యాక్షన్ ఇలా అన్నిటిని ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్ బాబి.



సినిమా రొటీన్ కథ అయినప్పటికీ టేకింగ్ విషయంలో డైరెక్టర్ బాబి మెగాస్టార్ అంటే ఎంత పిచ్చి ఉందో ప్రతిఫ్రేమ్ లో కూడా క్లియర్ గా కనిపిస్తోంది.సంక్రాంతికి కావాల్సిన అసలు సిసలైన కమర్షియల్ సినిమాగ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. దీంతో మంచి రెస్పాన్స్ కూడా వస్తోందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ఫస్ట్ అఫ్ అద్భుతంగా ఉందని సెకండాఫ్ లో ఎమోషన్స్ సన్నివేశాలు కూడా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలుస్తోంది. చిరంజీవి ,రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లో బ్లాస్ట్ అవుతున్నాయని అభిమానులు తెలియజేస్తున్నారు. అలాగే చిరంజీవి శృతిహాసన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా చూడవచ్చు అనే టాక్ మాత్రం బాగా వినిపిస్తోంది. మరి ఇదే రేంజ్ లో కలెక్షన్లను కూడా అందుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: