రామ్ చరణ్ భార్య ఉపాసన కు సినిమాలు అంటే చాలఇష్టం ఆఇష్టం వలనే ఆమె చరణ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది అని అంటారు. చరణ్ భార్యగా మారిన తరువాత ఆమె చరణ్ డ్రస్ డిజైనింగ్ గురించి అదేవిధంగా అతడి హెయిర్ స్టైల్ గురించి శ్రద్ద పెట్టడమే కాకుండా ఈవిషయమై ఆమె తరుచు దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ తో అదేవిధంగా హెయిర్ స్టైలిస్ట్ లతో తరుచు చర్చలు జరుపుతూ చరణ్ లుక్ పై ఆమె చాలశ్రద్ధ తీసుకుంటూ ఉంటుందని మెగా కాంపౌండ్ కు చెందిన సన్నిహితులు అంటూ ఉంటారు.


బిజినెస్ ఉమెన్ గా క్షణం తీరికలేని వ్యాపార వ్యవహారాలూ చూస్తూనే ఆమె ఇప్పుడు చరణ్ కు సంబంధించిన మరొక బాధ్యతను తీసుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత చరణ్ కు బాలీవుడ్ లో కూడ మంచి ఇమేజ్ ఏర్పడింది. అయితే ఈఇమేజ్ ని మరింత పెంచి బాలీవుడ్ లో కూడ చరణ్ హవా కొనసాగాలి అంటే బాలీవుడ్ లో అతడి ఇమేజ్ పెంచడానికి ఒక పవర్ ఫుల్ పిఆర్ టీమ్ ఉండాలి అన్న స్థిరనిర్ణయానికి ఉపాసన రావడంతో ఈవిషయమై ఉపాసన ఆలోచనలు కొనసాగుతున్నాయి అన్నవార్తలు వస్తున్నాయి.


బాలీవుడ్ టాప్ హీరోలు రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ షారూఖ్ ఖాన్ లాంటి టాప్ హీరోలకు ఉండే విధంగా ఒకస్ట్రాంగ్ పీఆర్ టీమ్ ను చరణ్ కు ముంబాయిలో ఏర్పాటు చేసే విధంగా కొందరు ప్రొఫిషనల్స్ తో ఉపాసన చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇలాంటి స్ట్రాంగ్ పిఆర్ టీమ్ ఉన్నవారికి పెద్దపెద్ద కంపెనీల యాడ్ టీమ్ లతో పరిచయాలు ఏర్పడి బ్రాండ్ అంబాసిడర్ లుగా అవకాశాలు వచ్చే ఆస్కారం చాలఎక్కువగా ఉంటుంది. ఈవిషయమై ఇప్పటికే మహేష్ అల్లు అర్జున్ లు చాలముందు వరసలో ఉంటూ భారీ యాడ్ డీల్స్ పొందుతూ కోట్లాది రూపాయల పారితోషికంతో పాటు జాతీయస్థాయిలో విపరీతమైన ఇమేజ్ ఏర్పడుతుంది.


ఇప్పుడు ఈవిషయాలలో కూడ చరణ్ ముందు వరసలో ఉండే విధంగా ఒక పవర్ ఫుల్ పిఆర్ టీమ్ ను చరణ్ కు ఏర్పాటు చేసే విధంగా కొన్ని ప్రముఖ పిఆర్ సంస్థలతో ఉపాసన చర్చలు జరుపుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: