సంక్రాంతి బరిలో విజయ్, అజిత్ బాక్సాఫీస్ వద్ద చాలా సంవత్సరాలుగా ఎదురుచూసిన క్లాష్ 9 ఏళ్ల తర్వాత జరిగింది. ఇద్దరు ప్రముఖ నటులకు సంబంధిత చిత్రాలు అజిత్ తునివు, విజయ్ వారిసు చిత్రాలు ఒకే రోజున జనవరి 11వ తేదీన అభిమానులకు సంక్రాంతి పండుగ ట్రీట్ గా విడుదలయ్యాయి. అందులో ఓపెనింగ్ రోజున బాక్స్ ఆఫీస్ వద్ద జరిగిన యుద్ధంలో విజయం సాధించింది. అయితే విజయ్ నటించిన గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ముందంజలో ఉన్నప్పటికీ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ విజేతగా నిలిచారు. నాలుగవ రోజు చివరిలో విజయ్ చిత్రం కంటే అజిత్ తునివు అనేక స్క్రీన్ లలో ముందుకు సాగుతున్నట్లు ఇప్పుడు తాజా నివేదికలు సూచిస్తున్నాము.

అజిత్ తునివు బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్కును కూడా దాటేసింది. మరియు ఈ చిత్రం నాలుగవ రోజు ముగింపులో ఏకంగా రూ.110 కోట్లకు చేరువైనట్లు తాజాగా వార్తలు అందుతున్నాయి. అజిత్ యాక్షన్ డ్రామా రాష్ట్రంలోని కొన్ని ప్రత్యేకమైన స్క్రీన్ లలో ప్రదర్శించబడి ప్రేక్షకుల మద్దతు పొందింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుండడంతో విజయ్ అభిమానులు కొంచెం నిరాశ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరోపక్క తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి వాల్తేరు వీరయ్య,  బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో కూడా బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. రెండు సినిమాలు కూడా పోటాపోటీగా కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతున్నాయి. ఇక రెండు సినిమాలతో పోల్చుకుంటే వీర సింహారెడ్డి సినిమా కంటే వాల్తేరు వీరయ్య కథపరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుంది. అయితే  బాలకృష్ణ,  చిరంజీవి ఇద్దరూ కూడా గెలవాలి అని సంక్రాంతి బరిలో ఇద్దరు హీరోలు సక్సెస్ పొందాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికైతే సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద అజిత్ తునివు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: