విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమా అందరికీ గుర్తుండి ఉంటుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కి జోడిగా నటించిన ప్రియాంక చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే అనంతపురంకి చెందిన ఈమె మొదట షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ని ప్రారంభించింది. ఇక ఆ షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు పొందిన ఈమె టాక్సీవాలా సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపును కూడా పొందింది ప్రియాంక. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమెకి వరుస సినిమాలలో అవకాశాలు రావడం ఖాయం అని అందరూ భావించారు. 

కానీ ఏమైందో తెలియదు గానీ అందరూ ఊహించిన విధంగా ఈమెకి ఆశించిన స్థాయిలో సినిమాలలో అవకాశాలు రాలేదు.అడపా దడపా సినిమాలో నటిస్తూ అలా అలా తన కెరియర్ను నెట్టుకోటిస్తోంది ప్రియాంక. ఈ సమయంలోనే ఎవరైనా ఒక స్టార్ హీరో సరోజన నటిస్తే బాగుంటుందని ఒక స్టార్ హీరో సినిమాలో ఒక అవకాశం వస్తే బాగుంటుంది అని.. భావిస్తారు. కానీ ప్రియాంక మాత్రం చాలా విచిత్రంగా ఆలోచిస్తుంది. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చిన చేయను అని చెప్పుకొచ్చింది. సాధారణంగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు.

అలాంటిది ఈమె మాత్రం పవన్ కళ్యాణ్ తో అవకాశం వచ్చినా కూడా నటించిన అంటూ చెప్పుకొచ్చింది. అవకాశం వస్తే తన డేట్స్ ను సర్దుబాటు చేసుకుని మరి నటిస్తారు. అలాంటిది ప్రియాంకకి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వస్తే చెయ్యను అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇందుకు ఒక బలమైన కారణం ఉంది అని చెబుతోంది ప్రియాంక. ఆమెకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని.. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాని 20 సార్లు చూశాను అని.. అంతేకాదు పవన్ ఖుషి సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ తనకి గుర్తుంది అని.. నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని.. దూరం నుంచి చూస్తే చాలు అని.. అంతకుమించి పవన్ కళ్యాణ్ దగ్గర నుండి తాను ఏమీ కోరుకోవడం లేదని..ఒకవేళ పవన్ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ చేయను అని చెప్పుకొచ్చింది ప్రియాంక..!!

మరింత సమాచారం తెలుసుకోండి: