ఈ మధ్య కాలంలో కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందనపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. అందులోనూ పైగా హీరో రిషబ్ శెట్టితో వివాదం అయితే ఈ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్ గా విమర్శలు చేసుకొని బాగా వార్తల్లో నిలిచారు. దీనివల్ల రష్మికపై వున్న నెగెటివిటీ డబుల్ అయ్యింది. రిషబ్ శెట్టిపై పాజిటివిటీ పెరిగింది. ఇక ఈ వివాదం మొదలవ్వడానికి అసలు కారణం మాత్రం రష్మికనే. ఎందుకంటే గతంలో రష్మిక చేసిన కామెంట్స్ ఆమె కొంప ముంచింది అంటున్నారు నెటిజన్స్. పైగా రష్మిక కామెంట్స్ పై కాంతార మూవీ తర్వాత రిషబ్ శెట్టి కూడా తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం హీరోయిన్ గా సూపర్ స్టార్డమ్ ని ఎంజాయ్ చేస్తున్న రష్మికని.. కిరాక్ పార్టీ సినిమా ద్వారా రిషబ్ శెట్టి ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టిలే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ సినిమా టైంలో హీరో రక్షిత్ తో పీకల్లోతూ ప్రేమాయణం నడిపింది రష్మిక.పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.అయితే ఎంగేజ్ మెంట్ అయ్యాక ఇద్దరూ విడిపోయారు. అప్పటినుండి ఎవరి దారిలో వారు సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీ అయ్యారు. రిషబ్ ఇంకా రక్షిత్ ఇద్దరూ ఎప్పుడు దీనిపై స్పందించలేదు.సైలెంట్ గా తమ పని చేసుకుంటూ వెళ్లారు.


అయితే.. హీరోయిన్ గా మంచి సక్సెస్ లో ఉన్నప్పుడు రష్మిక.. రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ ని 'సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్' అంటూ.. కనీసం ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా చేతులతో సైగలు చేస్తూ చాలా నీచంగా ప్రవర్తించింది.  ఆ వీడియో ఎంత వైరల్ అయ్యిందో చెప్పక్కర్లేదు.ఇక కాంతార సినిమా హిట్ అయ్యాక రిషబ్ శెట్టి కూడా రష్మిక స్టైల్ లోనే తిరిగి ఆమెకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ వేయడం ఎంతగానో ఆశ్చర్యపరిచింది. 'ఇక కొత్తవాళ్లతో సినిమాలు చేస్తా. కానీ.. ఇలాంటి వారితో అసలు వర్క్ చేయను' అంటూ రష్మికలాగే అతను కూడా సైగలు చేశాడు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. ఇన్నాళ్లు చేసిన వెధవ కామెంట్స్ పై ప్లేట్ మార్చి రక్షిత్, రిషబ్ శెట్టిల గురించి పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆమిప్పుడు నాలుగు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయ్యానని ఇంకా తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది మాత్రం.. రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టిలే అని చెప్పి ఎంతగానో ఆశ్చర్యపరిచింది. అలాగే తనపై వస్తున్న ట్రోల్స్ కూడా చాలా ఎక్కువయ్యాయని .. ఇకపై వాటిని సహించబోనని కూడా తేల్చి చెప్పేసింది రష్మిక. ప్రస్తుతం రష్మిక మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: