సినీ ఇండస్ట్రీ లో మాస్ మహారాజగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రవితేజ గురించి అందరికీ బాగా తెలుసు.ఈయన తాజాగా ధమాకా సినిమా ద్వారా మంచి విజయం అందుకున్నాడు.

త్రినాథరావు దర్శకత్వములో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. ఈ సినిమా ఎంతో సక్సెస్ సాధించడంతో రవితేజ మంచి ఖుషిలో ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య.

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య ఈ సినిమాలో రవితేజ ఏసీపీ పాత్ర లో నటించి తెగ సందడి చేశారు.ఈ సినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చింది.ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించడంతో రవితేజ మరింత గా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రవితేజను ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ అయితే వెంటాడుతుంది. రవితేజ నటించిన ఒక సినిమా హిట్ అయితే తన తదుపరి సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక సెంటిమెంట్. దాదాపు గత 13 సంవత్సరాలుగా ఇదే కొనసాగుతూ వస్తుందటా .అయితే 13 సంవత్సరాల తర్వాత రవితేజ తన బ్యాడ్ సెంటిమెంటును బ్రేక్ చేశారని చెప్పవచ్చు.2010 సంవత్సరంలో రవితేజ నటించిన డాన్ శీను అలాగే ఈ సినిమా తర్వాత వచ్చిన మిరపకాయ్ సినిమాలు రెండు కూడా మంచి విజయాలు అందుకున్నాయి.ఈ సినిమాల తర్వాత ఈయన ఒక హిట్ సినిమాలో నటిస్తే తదుపరి సినిమాలో ఫ్లాప్ అవడం తరచూ జరుగుతూ వస్తుంది. అయితే తాజాగా ధమాకా వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య కూడా హిట్ అవ్వడంతో ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను రవితేజ బ్రేక్ చేశారని అభిమానులు కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: