తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం దాటిపోయినప్పటికీ ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది మిల్కీ బ్యూటీ తమన్న. ఇక వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది అని చెప్పాలి. ఇకపోతే గత కొంతకాలం నుంచి తమన్నా భాటియాకు సంబంధించిన ఒక విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇన్నాళ్ళ వరకు డేటింగ్ల జోలికి పోనీ తమన్నా ఇక ఇప్పుడు ఒక నటుడుతో డీప్ డేటింగ్ లో కొనసాగుతుంది అంటూ ఒక వార్త ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.  ఆ నటుడు ఎవరో కాదు నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించిన విజయ వర్మ.


 ఈ ఇద్దరు కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని గోవాలో జరుపుకోవడం.. ఇక ఇటీవల ఒక అవార్డు ఫంక్షన్లో కూడా వీరిద్దరూ కలిసి రావడం.. గతంలో ముంబై ఎయిర్పోర్టులోను ఇక ఈ జంట దర్శనం ఇవ్వడంతో ఇక ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం మొదలయ్యాయి.  అయితే ఇక ఈ వార్తలను చూసి వారు ఎంజాయ్ చేస్తున్నారో ఇది నిజమే కదా అని ఊరుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పటివరకు ఇద్దరు ఈ వార్తలపై స్పందించలేదు.


 ఇటీవల విజయ్ వర్మ, తమన్నాతో డేటింగ్ లో ఉన్న విషయం పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు అని చెప్పాలి.  తన రాబోయే ప్రాజెక్ట్ డివోషనల్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ డైరెక్టర్ సుజోయ్ గోష్ తో ఉన్న ఫోటోని తన ట్విటర్ వేదికగా షేర్ చేశాడు అని చెప్పాలి. ఇదే నా అసలు లంచ్ డేట్ అంటూ విజయ వర్మ చెప్పుకొచ్చాడు. దీనిపై ఎంతోమంది నెటిజెన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలి. అయితే తన డేట్ గురించి ఫన్నీగా మాట్లాడిన విజయవర్మ.. తమన్నాతో రిలేషన్షిప్ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పాలి. ఏది ఏమైనా విజయ్ వర్మ పెట్టిన పోస్ట్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: