ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు పరిచయమైన చిరంజీవి ఇక టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు హవా నడిపించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు 60 ఏళ్ళు దాటిపోతున్న కూడా యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు తీస్తున్నాడు. ఇక సూపర్ హిట్ లు సాధిస్తూ ఇంకా తన క్రేజ్ తగ్గలేదు అన్న విషయాన్ని ప్రతి సినిమాతో నిరూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే మెగా స్టార్ చిరంజీవి ఏకంగా మెగా అనే బ్రాండ్ ను క్రియేట్ చేశారు.


 ఇక ఈ బ్రాండ్ ను ఉపయోగించుకునే ప్రస్తుతం ఇండస్ట్రీకి దాదాపు అరడజనుకు పైగా హీరోలు ఎంట్రీ ఇచ్చి తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని దూసుకుపోతున్నారు అని చెప్పాలి. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేదానికి చిరంజీవి నిదర్శనంగా ఉంటారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం హీరోగా ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగినప్పటికీ ఇంకా ఒక సాదాసీదా మనిషి లాగానే అందరితో కలిసి మెలిసి మాట్లాడుతూ ఉంటారు. అయితే చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే ఈ ప్రశ్న రాగానే ఇంకెవరు ఆయన వారసుడు రామ్ చరణ్ లేదంటే మెగా హీరోలలో ఎవరో ఒకరు ఆయన ఫేవరెట్ హీరో అయి ఉంటారు అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన ఫేవరెట్ హీరో మాత్రం మెగా హీరోలలో ఒకరు కాదట. నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ ఫేవరెట్ హీరోనట. డాన్స్ విషయంలో ఎన్టీఆర్ను చిరంజీవి ఎక్కువగా అభిమానిస్తారట. ఇక ఎన్టీఆర్ సినిమా నచ్చిందంటే చాలు స్వయంగా ఫోన్ చేసి అభినందిస్తారట. అంతే కాదు కొన్ని కొన్ని సార్లు మీడియా ముందు కూడా ఎన్టీఆర్ను పొగిడిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: