ఇటీవల కాలంలో వెండితెరపై విడుదలై సూపర్ హిట్ సాధించిన సినిమాలు అటు బుల్లితెరపై  హిట్ అవుతున్నాయా లేదా అన్నది కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే కొన్నిసార్లు వెండితెరపై ఫ్లాప్ అయిన సినిమాలు బుల్లితెరపై హిట్ అవుతూ టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ ఉంటాయి. మరికొన్నిసార్లు బిగ్ స్క్రీన్ పై సూపర్ హిట్ సాధించిన సినిమాలు స్మాల్ స్క్రీన్ పై మాత్రం రేటింగ్ సాధించలేక ఫ్లాప్ గానే మిగిలిపోతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇలా ఇటీవల కాలంలో టెలివిజన్ రంగంలో టిఆర్పి రేటింగ్ అనేది ఎంతో ముఖ్యంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ టి ఆర్ పి రేటింగ్ స్టార్ హీరోల భవిష్యత్తు సినిమాలకు నాన్ థియేటర్ బిజినెస్ కు ఉపయోగపడుతుంది అని చెప్పాలి. సాధారణంగా ఏదైనా కొత్త సినిమాను ఇక టెలివిజన్ పై ప్రసారం చేశారు అంటే చాలు ఇక ఆ సినిమాకు  టాప్ టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇటీవల ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ సాధించిన పుష్ప సినిమాకు ఒక పాత సినిమా ఊహించని పోటీ ఇవ్వడం గమనార్హం.


 అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను టెలివిజన్ పై ప్రసారం చేయగా మంచి డీసెంట్ టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది. అయితే ఇదివరకే చాలాసార్లు పుష్ప సినిమా స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ అయింది. అయితే గత వారం మరోసారి టెలికాస్ట్ కాగా 4.46 టిఆర్పి రేటింగ్ అందుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే అటు వెంకటేష్ హీరోగా నటించిన ఒకప్పటి సూపర్ హిట్ రాజా సినిమా పుష్ప సినిమా టిఆర్పి రేటింగ్ తో పోటీ పడింది. ఇప్పటికే వేలసార్లు అన్ని చానల్స్ లో కూడా ప్రసారమైంది ఈ సినిమా. అయితే రీసెంట్ గా మరోసారి టెలికాస్ట్ చేస్తే 3.33  టి ఆర్ పి సొంతం చేసుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Trp